Revanth Reddy Meets Chandrababu : అర్థరాత్రి చంద్రబాబును రహస్యంగా కలుసుకున్న రేవంత్‌రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(Telangana Assembly Elections 2023) దగ్గరకు వచ్చేశాయి. మరో 17 రోజుల్లో జరిగే ఎన్నికలను అధికార బీఆర్‌ఎస్(BRS) ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు కాంగ్రెస్(Congress) కూడా అధికారం కోసం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. కేసీఆర్(CM KCR) ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది.

Telangana Elections 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(Telangana Assembly Elections 2023) దగ్గరకు వచ్చేశాయి. మరో 17 రోజుల్లో జరిగే ఎన్నికలను అధికార బీఆర్‌ఎస్(BRS) ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు కాంగ్రెస్(Congress) కూడా అధికారం కోసం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. కేసీఆర్(CM KCR) ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. 2018 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ(TDP)తో పొత్తు పెట్టుకుని నిండా మునిగిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఆ పొరపాటు చేయకుండా పరోక్షంగా టీడీపీ మద్దతును కూడగట్టింది. కాంగ్రెస్ కోసమే తెలంగాణ టీడీపీ(TTDP) పోటీలోంచి తప్పుకుందన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే చంద్రబాబు(Chandrababu) ప్రియ శిష్యుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) అంటే టీడీపీ క్యాడర్(TDP Cader)కు అమితమైన ప్రేమ. టీడీపీలో రేవంత్‌రెడ్డి చాలా కాలం ఉన్నారు. చంద్రబాబు చెప్పినట్టుగా వినుకునే రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసు(Note For Vote Case)లో అడ్డంగా దొరికారు కూడా! తన మాట జవదాటని రేవంత్‌రెడ్డిని ఎలాగైనా ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టాలన్నది చంద్రబాబు ప్రయత్నం. అందులో భాగంగానే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదన్న ఉద్దేశంతో టీడీపీ ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంది. ఈ క్రమంలో ఇటీవల చంద్రబాబును అర్థరాత్రి వేళ రేవంత్‌రెడ్డి రహస్యంగా కలుసుకున్నారట! ఇద్దరూ చాలాసేపు సంభాషించుకున్నారట! ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలో రేవంత్‌రెడ్డికి చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. మధ్యంతర బెయిల్(interim bail)పై ఉన్న చంద్రబాబునాయుడు తెలంగాణ ఎన్నికలపై కాంగ్రెస్ నాయకులకు తగు సూచనలు, సలహాలు ఇస్తున్నారట! తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంపార్టీ పవర్‌లోకి వచ్చినట్టేనని ఓ సామాజికవర్గం బలంగా నమ్ముతోంది. అందుకోసం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ నేతలు రహస్యంగా ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు. రేవంత్‌రెడ్డికి ఆర్థికంగా ఆదుకుంటున్నారు కూడా! ఎన్నికల బరిలోంచి తెలుగుదేశం పార్టీ తప్పుకున్నదన్న మాటే కానీ, కాంగ్రెస్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది..
