యాదగిరిగుట్ట ఆలయంలో(Yadagirigutta TEmple) ఇటీవల ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది కదా! మొన్న జరిగిన బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో(CM Revanth Reddy) పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti vikramarka), మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komati reddy venkat reddy), ఉత్తమ్‌కుమార్ రెడ్డి(Utham kumar reddy), కొండా సురేఖలు(Konda surekha) హాజరయ్యారు. భట్టి విక్రమార్క్, కొండా సురేఖలకు ఇతర మంత్రులతో సమానంగా కుర్చీలలో కాకుండా చిన్న పీటలపై కూర్చొబెట్టారు.
యాదగిరిగుట్ట ఆలయంలో(Yadagirigutta TEmple) ఇటీవల ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది కదా! మొన్న జరిగిన బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో(CM Revanth Reddy) పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti vikramarka), మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komati reddy venkat reddy), ఉత్తమ్‌కుమార్ రెడ్డి(Utham kumar reddy), కొండా సురేఖలు(Konda surekha) హాజరయ్యారు. భట్టి విక్రమార్క్, కొండా సురేఖలకు ఇతర మంత్రులతో సమానంగా కుర్చీలలో కాకుండా చిన్న పీటలపై కూర్చొబెట్టారు. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరుసటి రోజు భట్టి విక్రమార్క్ రియాక్టయ్యారు. తనకు ఎలాంటి అవమానం జరగలేదని, ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో తాను ఉన్నానని, తన మాటకు ఎదురు ఉండదని చెప్పుకొచ్చారు. నిజమే కాబోలనుకున్నారంతా. కానీ అక్కడ ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగిందన్నది విస్పష్టం. అందుకే ఆయల ఇన్‌ఛార్జ్ కార్య నిర్వహణాధికారిగా కొనసాగుతున్న రామకృష్ణరావును(Rama Krishna Rao) ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన ప్లేస్‌లో భాస్కర్‌రావును(Bhaskar rao) నియమించారు. దీనిపై అధికారికంగా స్పష్టత లేదు. ఫారెన్ సర్వీసుల కింద డిప్యూటేషన్ పద్దతిలో ఈ నియామకాన్ని జరిపినట్టు చెబుతున్నారు. కేసీఆర్(KCR) ప్రభుత్వంలో ఈఓగా కొనసాగిన విశ్రాంత అధికారి గీతారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దీర్ఘకాల సెలవుపై వెళ్లిపోయారు. దాంతో దేవాదాయశాఖ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న రామకృష్ణారావుకు ప్రభుత్వం యాదగిరిగుట్ట ఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించింది. రెండున్నర నెలలు కూడా కాలేదు ఆయనను బాధ్యతల నుంచి తప్పించారు. అన్నట్టు మొన్న జరిగిన సంఘటన మళ్లీ రిపీట్ కాకుండా ఉండేందుకు కొత్తగా పది పీటలుకొన్నారు ఆలయ అధికారులు. ఇప్పటికే నాలుగు పీటలు ఉండటంతో ఇప్పుడు పీటల సంఖ్య 14కు చేరింది. ఈ పీటలన్నీ ఒకే రకమైన ఎత్తుతో ఉండేట్టు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈసారి ఒకేమారు 14 మంది వీవీఐపీలు వచ్చినా సమానంగా కూర్చొవచ్చు..