దేశానికి గుర్తింపు రావడానికి మహాత్మా గాంధీ (Mahatma Gandhi), డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్(Ambedkar ) ఇద్దరే కారణమ‌ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. బాబా సాహెబ్ డా.బీఆర్ అంబేద్కర్ జయంతి(Ambedkar Jayanti) సందర్బంగా రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. శామీర్ పేట్(Shameerpet) వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిచారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ స్ఫూర్తితో కాంగ్రెస్ దళితులకు ఎన్నో […]

దేశానికి గుర్తింపు రావడానికి మహాత్మా గాంధీ (Mahatma Gandhi), డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్(Ambedkar ) ఇద్దరే కారణమ‌ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. బాబా సాహెబ్ డా.బీఆర్ అంబేద్కర్ జయంతి(Ambedkar Jayanti) సందర్బంగా రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. శామీర్ పేట్(Shameerpet) వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిచారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

అంబేద్కర్ స్ఫూర్తితో కాంగ్రెస్ దళితులకు ఎన్నో అవకాశాలు కల్పించిందని పేర్కొన్నారు. రాష్ట్రపతిగా, లోక్ సభ స్పీకర్ గా, ముఖ్యమంత్రులుగా కాంగ్రెస్(Congress) అవకాశం కల్పించిందని తెలిపారు. భవిష్యత్ లో కూడా అంబేద్కర్ స్ఫూర్తిని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పించి అంబేద్కర్ స్ఫూర్తిని ముందుకు తీసుకెళతామ‌ని తెలిపారు. శామీర్ పేట్ లో అంబేద్కర్ భవనానికి నా ఎంపీ నిధుల నుంచి 15 లక్షలు మంజూరు చేస్తాన‌ని తెలిపారు. అంబేద్క‌ర్ భవన నిర్మాణానికి నా వంతు సహకారం అందిస్తాన‌ని వెల్ల‌డించారు. ప్రగతి భవన్ ను డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంగా మారుస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామ‌ని తెలిపారు.

Updated On 14 April 2023 3:10 AM GMT
Yagnik

Yagnik

Next Story