తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా పొందుర్తిలో అకాల వర్షం కారణంగా పంట నష్టానికి గురైన రైతులను కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లలో రైతులు ఏ ఒక్క రోజు కూడా సంతోషంగా లేరని అన్నారు. తెలంగాణ మోడల్ అంటే రైతుల ఆత్మహత్యలా? అని ప్రశ్నించారు.

Revanth Reddy met the farmers who suffered crop loss due to untimely rain
తెలంగాణ(Telangana) రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే అత్యధికంగా రైతులు ఆత్మహత్య(Farmers Suicides) చేసుకున్నారని టీపీసీసీ (TPCC)అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. కామారెడ్డి(Kamareddy) జిల్లా పొందుర్తి(Pondurthi)లో అకాల వర్షం కారణంగా పంట నష్టానికి గురైన రైతులను(Farmers) కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లలో రైతులు ఏ ఒక్క రోజు కూడా సంతోషంగా లేరని అన్నారు. తెలంగాణ మోడల్(Telangana Model) అంటే రైతుల ఆత్మహత్యలా? అని ప్రశ్నించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. ఈ నెపాన్ని కేసీఆర్(CM KCR) కేంద్రంపై నెట్టం ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం కొంటేనే కొంటామని అంటే.. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? అని ప్రశ్నించారు.
రైతులు ఓట్లేస్తేనే కదా మీరు ముఖ్యమంత్రి(Cheif Minister) అయ్యారు. రైతుల ఓట్లతో గద్దెనెక్కి.. రైతుల గుండెలపై తన్నే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అధికారిక లెక్కల ప్రకారం ప్రతీ సంవత్సరం 1200 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వివరించారు. తెలంగాణ వచ్చాక 2 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యలకు కారణం సీఎం కేసీఆర్(CM KCR). సీఎం కేసీఆర్ రైతు హంతకుడని తీవ్రస్థాయలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసిందని అన్నారు.
వడగళ్ల వానతో రైతులు పూర్తిగా నష్టపోయారు. .ఈ పరిసర ప్రాంతాల్లో వెయ్యి ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పంట నష్టం అంచనా వేసి.. ఎకరాకు 20వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మామిడి తోటలకు ఎకరాకు 50వేలు నష్టపరిహారం అందించాలని అన్నారు. తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనాలి. రైతుకు కావాల్సింది రైతు బీమా కాదు.. పంట బీమా అని అన్నారు.
పంట నష్టం పరిశీలించకుండా.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో దావత్ లు చేసుకుంటున్నారని ఆరోపించారు. శాసనసభ్యులను క్షేత్ర స్థాయిలో పర్యటనకు పంపాలని అన్నారు. ఐఏఎస్ అధికారులను పంపి పంట నష్టాన్ని అంచనా వేయించాలని కోరారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై పోరాడతామని తెలిపారు. ఈరోజు నుంచి కాంగ్రెస్ నేతలు క్షేత్ర స్థాయిలో పర్యటించి పంట నష్టంపై నివేదికలు ఇస్తూ.. రైతులకు మనో ధైర్యం కల్పిస్తామని తెలిపారు. దయచేసి రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. ఆరునెలల్లో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు.
