తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి(Telangana CM) గురువారం మధ్యాహ్నం సుమారు ఒంటిగంట ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు తెలంగాణ పీసీసీ ఆహ్వానాలు పంపింది.

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి(Telangana CM) గురువారం మధ్యాహ్నం సుమారు ఒంటిగంట ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు తెలంగాణ పీసీసీ ఆహ్వానాలు పంపింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(YS Jagan), తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR), తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌(MK Stalin), టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)లను కూడా ఆహ్వానించారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌, ప్రియాంకగాంధీలను రేవంత్‌రెడ్డే ఢిల్లీ వెళ్లి స్వయంగా ఆహ్వానించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, ఆ రాష్ట్ర మంత్రులకు ఆహ్వానాలు పంపారు. సీనియర్‌ నేతలు చిదంబరం, అశోక్‌ గెహ్లాట్‌, దిగ్విజయ్‌ సింగ్‌, వీరప్ప మొయిలీ, మీరాకుమార్‌, కుంతియా, భూపేష్‌ బఘేల్‌, అశోక్‌ చవాన్‌, వాయలార్‌ రవి, సుశీల్‌కుమార్‌ షిండే, మాణికం ఠాగూర్‌, కురియన్‌లను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, గాదె ఇన్నయ్య, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, కంచె ఐలయ్యలతో పాటు వివిధ కులసంఘాల నేతలను ఆహ్వానించారు. పలువురు సినీ ప్రముఖులకు కూడా కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆహ్వానాలు పంపారు.

Updated On 6 Dec 2023 5:32 AM GMT
Ehatv

Ehatv

Next Story