టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy రేపు మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి(Telangana New CM)గా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ప్రమాణ స్వీకారం ఎల్‌బీ(LB Stadium) స్టేడియంలో ఘనంగా జరుగనుంది. దాదాపు లక్ష మంది కార్యక్రమానికి హాజరవుతారని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి.

Revanth Reddy Invitation
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy రేపు మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి(Telangana New CM)గా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ప్రమాణ స్వీకారం ఎల్‌బీ(LB Stadium) స్టేడియంలో ఘనంగా జరుగనుంది. దాదాపు లక్ష మంది కార్యక్రమానికి హాజరవుతారని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి సీఎల్పీ నాయకుడు రేవంత్ రెడ్డి 'ప్రజా ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి ఆహ్వానం' పేరుతో ఆహ్వాన పత్రాన్ని విడుదల చేశారు.
ఇందులో మొదటగా.. తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగాన్ని గుర్తుచేశారు. సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైనదని వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు.. బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు.. మీ అందరి ఆశీస్సులతో 2023 డిసెంబర్ 7న, మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోంది. ఈ మహోత్సవానికి రావాల్సిందిగా మీ అందరికీ ఇదే ఆహ్వానం అంటూ ఆహ్వాన పత్రం విడుదల చేశారు.
