పోరాటాలు, త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కోన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారి ఆయన ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతూ.. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం ఉక్కు సంకల్పంతో సోనియమ్మ తెలంగాణ ఏర్పాటు చేసిందన్నారు. దశాబ్ద కాలపు నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడి..

CM Revanth Reddy First Speech
పోరాటాలు, త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కోన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారి ఆయన ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతూ.. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం ఉక్కు సంకల్పంతో సోనియమ్మ తెలంగాణ ఏర్పాటు చేసిందన్నారు. దశాబ్ద కాలపు నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడి.. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అన్నారు.
అమరుల ఆశయ సాధనకు ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనిందని.. ప్రమాణ స్వీకారం మొదలైనపుడే అక్కడ ప్రగతి భవన్ గడీ ఇనుప కంచెలు బద్దలు కొట్టామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నా.. ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు అని పేర్కొన్నారు. ఇవాళ ప్రగతి భవన్ చుట్టూ కంచెలు బద్దలు కొట్టామని ఉద్వేగంగా చెప్పారు.
రేపు ఉదయం 10 గంటలకు జ్యోతీరావు పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్బారు నిర్వహిస్తామనన్నారు. మేం పాలకులం కాదు.. మేం సేవకులం అని వివరించారు. మీరు ఇచ్చిన అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి వినియోగిస్తాం.. కార్యకర్తల కష్టాన్ని, శ్రమను గుండెల్లో పెట్టుకుంటానని ప్రసంగం ముగించారు.
