నేడు ఖమ్మం(Khammam)లో కాంగ్రెస్ తలపెట్టిన ‘తెలంగాణ జన గర్జన’(Telangana Jana Garjana) బీఆర్ఎస్ వెన్నులో వణుకుపుట్టిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC Chief Revanth Reddy) ట్వీట్‌లో పేర్కొన్నారు. సభకు వచ్చే అశేష జనవాహినికి ట్రాన్స్ పోర్టు అడ్డంకులు సృష్టించి.. సంక్షేమం కట్ చేస్తామని బెదిరించి ప్రభంజనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేడు ఖమ్మం(Khammam)లో కాంగ్రెస్ తలపెట్టిన ‘తెలంగాణ జన గర్జన’(Telangana Jana Garjana) బీఆర్ఎస్ వెన్నులో వణుకుపుట్టిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC Chief Revanth Reddy) ట్వీట్‌లో పేర్కొన్నారు. సభకు వచ్చే అశేష జనవాహినికి ట్రాన్స్ పోర్టు అడ్డంకులు సృష్టించి.. సంక్షేమం కట్ చేస్తామని బెదిరించి ప్రభంజనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర చెయ్యిని అడ్డు పెట్టి సూర్య కాంతిని ఆపలేరన్న సత్యాన్ని ప్రభుత్వం గ్రహిస్తే మంచిదని సూచించారు. అధికారులు పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
తమ నాయకుడు పాదయాత్ర పూర్తి చేసుకోవడం.. పెద్ద ఎత్తున చేరికలు ఉండడంతో ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ తలపెట్టిందని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. సభకు విఘాతం కలిగించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయని ఆరోపించారు. పోలీసులు అడుగడుగునా తమ కార్యకర్తలను అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. సభకు రాకుండా ఇప్పటికే ఆర్టీసీ బస్సులను ఇవ్వని బీఆర్ఎస్ సర్కార్.. ప్రైవేటు వెహికల్స్ ని కూడా రానివ్వకుండా చెక్ పోస్టులు పెట్టి పోలీసులు వాహనాలను సీజ్ చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామాలలో సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరిస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీగా దీన్ని తీవ్రంగా ఖండిస్తుందన్నారు. పోలీసులు నిజాయితీగా పని చేయాలి.. బీఆర్ఎస్ కు ఏజెంట్లుగా పనిచేయొద్దన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన సభ ఆగదు.. మా కార్యకర్తలు కన్నెర్ర చేస్తే బీఆర్ఎస్ తట్టుకోవడం కష్టమని హెచ్చిరించారు.