తెలంగాణలో డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం ఏర్పడటం ఖాయం.. ఎల్బీ స్టేడియంలో ఆరు గ్యారంటీలపై సంతకం పెట్టడం ఖాయమన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని
తెలంగాణ(Telangana)లో డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం ఏర్పడటం ఖాయం.. ఎల్బీ స్టేడియం(LB Stadium)లో ఆరు గ్యారంటీలపై సంతకం పెట్టడం ఖాయమన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy). కేసీఆర్(KCR) తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని సోనియాగాంధీ(Sonia Gandhi) తొమ్మిదేళ్లు ఎదురుచూశారు కానీ 4 కోట్ల ప్రజలను మోసాగించినట్లే సోనియాగాంధీని కూడా కేసీఆర్ మోసం చేశారని రేవంత్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయి. అందుకే సెప్టెంబర్ 17న సోనియమ్మ ఆరు గ్యారంటీలను ప్రకటించారని ఆయన అన్నారు. కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరతామని రేవంత్ రెడ్డి పునరుద్ఘటించారు.
తెలంగాణను కేసీఆర్ తాగుబోతుల అడ్డాగా మార్చారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ఏం చేసిందంటూ బిల్లా రంగాలు చిత్తకార్తె కుక్కల్లా తిరుగుతున్నారన్నారు. బిల్లా రంగాలు ఎవరో కాదు కేటీఆర్(KTR).. హరీష్(Harish) అని ఆయన వ్యాఖ్యానించారు. నీఅయ్యా సీఎం అయినా.. నువ్వు మంత్రి అయినా సోనియాగాంధీ పెట్టిన భిక్ష అని, అమెరికాలో బాత్ రూమ్ లు కడిగే నువ్వు.. మంత్రివి అయ్యావంటూ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేటీఆర్.. మీరు అనుభవిస్తున్న ఈ పదవులు కాంగ్రెస్ పెట్టిన బిక్ష.. సోనియమ్మ దయ అని గుర్తుపెట్టుకోవాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యవసాయానికి ఉచిత కరెంటు, రైతులకు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రబ్బరు చెప్పులతో తిరిగిన హరీష్ ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మట్లాడుతున్నారని, మా కార్యకర్తలపై ఇన్నాళ్లు కేసులు పెట్టారని, ఇంకో 45 రోజుల్లో మా కార్యకర్తల కు మంచి రోజులు రాబోతున్నాయన్నారు. అందరూ అధికారుల సంగతి తేల్చుతామన్న రేవంత్ రెడ్డి.. అధికారులకు మిత్తి తో సహా ఇస్తామన్నారు. రాష్ట్ర డీజీపీని తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ప్రభాకర్ రావు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నవారిపై, కాంగ్రెస్ నాయకుల ఫోన్ లపై నిఘా పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ కు సాయం చేసేవారిని బెదిరిస్తే ఊరుకునేది లేదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
“కేటీఆర్ కాంగ్రెస్ కు సాయం చేస్తున్న 75 మంది లిస్టును తయారు చేశారట.. ఆ లిస్టును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ఇచ్చారు. కొంతమందిని కేటీఆరే స్వయంగా బెదిరిస్తున్నారట. బిడ్డా కేటీఆర్.. గుర్తు పెట్టుకో..నీ అధికారం 45 రోజులే.. ఆ తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంతకు ఇంత మిత్తితో చెల్లిస్తాం. అరవింద్ కుమార్, జయేష్ రంజన్, సోమేశ్ కుమార్ లాంటి అధికారులు చందాలు ఇవ్వాలని ప్రోత్సహిస్తున్నారు. అధికారులు అధికారుల్లా వ్యవహరించండి... బీఆరెస్ కార్యకర్తల్లా కాదు” అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అక్బరుద్దీన్ ఓవైసీ(Akbaruddin Owaisi) కూడా మోదీ(Modi), కిషన్ రెడ్డి(Kishan Reddy), రాజాసింగ్(Raja Singh) లా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. నన్ను భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేయాలంటున్నారు..భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చేందుకు నేను సిద్ధం... మీరు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలారా 45రోజులు అకుంఠిత దీక్షతో పనిచేస్తే అధికారం మనదే అని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.