కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయలపై ఐటీ శాఖ దాడుల విషయంలో టీపీసీసీ రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ..
కాంగ్రెస్(Congress) నేతల ఇళ్లు, కార్యాలయలపై ఐటీ శాఖ దాడుల(Income Tax Raids) విషయంలో టీపీసీసీ రేవంత్ రెడ్డి(Revanth Reddy) సీరియస్ అయ్యారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ దాడులకు కాంగ్రెస్ భయపడేది లేదన్నారు. పాలేరు(Paleru) అభ్యర్థి పొంగులేటి(Ponguleti Srinivas Reddy)పై ఐటీ అధికారులు పెద్దఎత్తున దాడులు చేస్తూ భయపెట్టాలని చూస్తున్నారు.. ఇది బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) కలిసి చేస్తున్న రాజకీయ కుట్రగా పేర్కొన్నారు. ఇలాంటి రాజకీయ బెదిరింపులకు కాంగ్రెస్ నాయకులు భయపడరని అన్నారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్ అంత అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఒక్క కాంగ్రెస్ నాయకులను టార్గెట్ గా చేసుకొని ఐటీ దాడులు చేస్తుందని ఆరోపించారు. గత వారం రోజుల నుంచి కాంగ్రెస్ నాయకుల ఇళ్లల్లో మాత్రమే ఐటీ దాడులు చేస్తూ.. వారిని భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ కలిసి చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికలలో ఆ రెండు పార్టీ లకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని రేవంత్ రెడ్డి అన్నారు.