బీఆర్‌ఎస్ పాలనలో తాగునీటి కష్టాలు ఉండేవి కావని.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి
బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు లోక్‌సభ నియోజకవర్గాల్లో బలహీన అభ్యర్థులను బరిలోకి దింపుతున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి టీ హరీశ్‌రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీని బలహీనపరిచేందుకు కాంగ్రెస్, బీజేపీ రెండూ రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని అనన్ఱు. వారి కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి చాలా చోట్ల బలహీనమైన అభ్యర్థులను దింపుతున్నారని ఆరోపించారు. కరీంనగర్‌లోనూ ఇదే ఫార్ములా అమలవుతోందని.. అందుకే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికలో జాప్యం జరుగుతోందని అన్నారు. శుక్రవారం రాత్రి కరీంనగర్ పట్టణంలోని రామ్‌నగర్‌లో జరిగిన కార్నర్ మీటింగ్‌లో హరీశ్‌రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
బీఆర్‌ఎస్ పాలనలో తాగునీటి కష్టాలు ఉండేవి కావని.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హరీష్ రావు అన్నారు. మరోవైపు సాగునీరు అందకపోవడంతో వేసిన పంటలు ఎండిపోయాయి. కేసీఆర్ కరీంనగర్ పర్యటనలో రైతులకు రూ.500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే దీనిపై రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా స్పందించారు. సీఎంగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.