తెలంగాణకు పట్టిన చీడ, పీడను వదిలించేందుకు రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చారు. తెలంగాణ రాష్టానికి ఓ సుదినం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ జన గర్జన సభ ఆయన మాట్లాడుతూ.. 1200 మంది త్యాగాలను గుర్తించి తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది. కాలనాగులా, అనకొండలా కల్వకుంట్ల కుటుంబం తెలంగాణాను కొల్లగొట్టిందని ఆరోపించారు.
తెలంగాణ(Telangana)కు పట్టిన చీడ, పీడను వదిలించేందుకు రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇక్కడికి వచ్చారు.. తెలంగాణ రాష్టానికి ఓ సుదినం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) వ్యాఖ్యానించారు. తెలంగాణ జన గర్జన(Telangana Jana Garjana) సభలో ఆయన మాట్లాడుతూ.. 1200 మంది త్యాగాలను గుర్తించి తల్లి సోనియమ్మ(Soniya Gandhi) తెలంగాణ ఇచ్చింది. కాలనాగులా, అనకొండలా కల్వకుంట్ల కుటుంబం తెలంగాణాను కొల్లగొట్టిందని ఆరోపించారు. తెలంగాణ జన గర్జన సభను విఫలం చేసేందుకు బీఆర్ఎస్(BRS) ప్రయత్నించింది. బీఆర్ఎస్ అడ్డుగోడలను దాటుకుని సభకు వచ్చి విజయవంతం చేశారు. మీ అందరి తరపున రాహుల్ గాంధీకి మాట ఇస్తున్నా..రాబోయే డిసెంబర్ 9 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) అధికారంలో ఉంటుందని అన్నారు. పేదలకు రూ.4000 పెన్షన్(Pention) ఇవ్వాలని కాంగ్రెస్(Congress) నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా కాంగ్రెస్ పాలన ఉంటుందన్నారు. ఖమ్మం(Khammam)లో 10 సీట్లు గెలిపించండి రాష్ట్రంలో 80 సీట్లు గెలిపించే బాధ్యత మాది అని రేవంత్ రెడ్డి కార్యకర్తలను, ప్రజలను కోరారు.