దశాబ్ది ఉత్సవాలపై కేసీఆర్‌ను విమర్శించిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సొంత వ్యవహారంలా చేస్తోందని మండిపడ్డారు. ఇది ప్రజలకు అసౌకర్యంగా మారిందని.. దీన్ని ఖండించాలన్నారు. గ్రామస్థాయి నుంచి అధికారులందరూ బీఆర్ఎస్ సేవలో మునిగిపోయారని ధ్వజమెత్తారు. పదేళ్లలో కేసీఆర్ అటకెక్కించిన హామీలను ప్రజల్లోకి తీవ్రంగా తీసుకెళ్లాలని నేతలకు, కార్యకర్తలను సూచించారు.
దశాబ్ది ఉత్సవాల(Dashabdhi Usthavalu)ను బీఆర్ఎస్(BRS) సొంత వ్యవహారంలా చేస్తోందని మండిపడ్డారు. ఇది ప్రజలకు అసౌకర్యంగా మారిందని.. దీన్ని ఖండించాలన్నారు. గ్రామస్థాయి నుంచి అధికారులందరూ బీఆర్ఎస్ సేవలో మునిగిపోయారని ధ్వజమెత్తారు. పదేళ్లలో కేసీఆర్(KCR) అటకెక్కించిన హామీలను ప్రజల్లోకి తీవ్రంగా తీసుకెళ్లాలని నేతలకు, కార్యకర్తలను సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు గుర్తుచేసేలా కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు ఉంటాయని రేవంత్(Revanth Reddy) స్పష్టం చేశారు. చేరికలపై ఊహాగానాలు వద్దు.. చాలా అంశాలు చర్చల దశలోనే ఉన్నాయన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక.. మేమే అధికారికంగా ప్రకటిస్తామన్నారు రేవంత్ రెడ్డి.
శనివారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కన్వీనర్ గా షబ్బీర్ అలీ(Shabbir Ali) బాధ్యత వహిస్తారన్నారు. మండల కమిటీలకు సంబంధించి చాలా ప్రతిపాదనలు వచ్చాయని.. 10 రోజుల్లో అన్ని మండల కమిటీలు పూర్తి చేస్తామని చెప్పారు. దశాబ్ది ఉత్సవాలను బీఆర్ఎస్ సొంత వ్యవహారంలా చేస్తోందని మండిపడ్డారు. ఇది ప్రజలకు అసౌకర్యంగా మారిందని.. దీన్ని ఖండించాలన్నారు రేవంత్. ఈ కార్యక్రమాలతో ప్రభుత్వ యంత్రాంగం కుప్పకూలిపోయిందని ఫైర్ అయ్యారు. పరిపాలన వ్యవస్థ స్తంభించిపోయిందని దుయ్యబట్టారు. గ్రామస్థాయి నుంచి అధికారులందరూ బీఆర్ఎస్ సేవలో మునిగిపోయారని ధ్వజమెత్తారు. ఇవి దశాబ్ది ఉత్సవాలు కాదు.. దశాబ్ది దగా అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.
ఈ నెల 22న 119 నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు తీయాలన్నారు రేవంత్ రెడ్డి. ఈ నిరసన ర్యాలీలో రావణాసురుడి(Ravanasura) రూపంలో ఉన్న కేసీఆర్(KCR) పది వైఫల్యాలతో కూడిన దిష్టిబొమ్మ దగ్ధం చేస్తామని చెప్పారు. ఆర్డీవో కార్యాలయాలు లేదా ఎమ్మార్వో కార్యాలయాల్లో వినతిపత్రం సమర్పించాలన్నారు రేవంత్ రెడ్డి. పదేళ్లలో కేసీఆర్ అటకెక్కించిన హామీలను ప్రజల్లోకి తీవ్రంగా తీసుకెళ్లాలని నేతలకు, కార్యకర్తలను సూచించారు. కేజీ టూ పేజీ, ఫీజు రీయింబర్స్ మెంట్(Fee Reimbursement), నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాలు, పోడు భూములకు పట్టాలు, రైతు రుణమాఫీ, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్, ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్ హామీల విషయంలో తెలంగాణ సర్కార్ ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు గుర్తుచేసేలా కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు ఉంటాయని స్పష్టం చేశారు. బీసీ డిక్లరేషన్, మహిళా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్ పై చర్చ జరుగుతోందన్నారు. భట్టి(Bhatti Vikramarka) పాదయాత్ర ఈ నెలాఖరులో ముగుస్తుందని చెప్పారు. ఖమ్మం(Khammam)లో జాతీయ నాయకులతో ఒక భారీ ముగింపు సభ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నట్లు వివరించారు. భట్టితో సంప్రదించి ముగింపు సభ నిర్వహించాలనుకుంటున్నామని తెలిపారు రేవంత్ రెడ్డి.
బీసీ(BC)లలో ఉన్న అన్ని కులాలకు లక్ష రూపాయల రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బీ నర్సింగరావు(Narsinga Rao) సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి.. అలాంటి ఆయనకు ప్రభుత్వ పెద్దలు అపాయింట్ మెంట్(Appointment) ఇవ్వకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ కవులు, కళాకారులను అవమానించే హక్కు కేటీఆర్(KTR) కు లేదన్నారు. ఇప్పటికైనా వారిని గౌరవించి వారికి అపాయింట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ అవమానించారని మండిపడ్డారు. పదేళ్లు పూర్తయినా 600 మంది అమరులను కూడా గుర్తించలేకపోయారని రేవంత్ దుయ్యబట్టారు. రెండో రాజధాని(Second Capital)పై ప్రతిపాదన వస్తే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుందా? రాష్ట్రానికి వెళ్తుందా తెలియాలని డిమాండ్ చేశారు. విస్తృతంగా చర్చించిన తరువాతే ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.