కేసీఆర్ కుటుంబం(KCR Family) లక్షకోట్ల అవినీతికి పాల్పడిందని టీపీసీసీ(TPPC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. మంగళవారం 77వ స్వాతంత్ర్య దినోత్సవం(77th Independence day) సందర్భంగా గాంధీ భవన్లో(Gandhi bhavan) జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసగించారు.

కేసీఆర్ కుటుంబం(KCR Family) లక్షకోట్ల అవినీతికి పాల్పడిందని టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. మంగళవారం 77వ స్వాతంత్ర్య దినోత్సవం(77th Independence day) సందర్భంగా గాంధీ భవన్లో(Gandhi bhavan) జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసగించారు. కేసీఆర్ కుటుంబం లక్షకోట్ల అవినీతికి పాల్పడింది, 10వేల ఎకరాలు దోచుకుంది అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆరెస్ ప్రభుత్వం హడావుడిగా అమ్మిన భూములపై అధికారంలోకి వచ్చాక సమీక్షిస్తామన్నారు.

కాంగ్రెస్ హామీలు ఇస్తుంటే.. సీఎం కేసీఆర్ అదే పని చేస్తున్నార‌ని అన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ రుణమాఫీ, ఉద్యోగ నోటిఫికేషన్లు, డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తానంటున్నార‌ని రేవంత్ విమర్శించారు. ఆరోగ్యశ్రీని సీఎం నిర్వీర్యం చేశాడన్నారు. రాష్ట్రంలో గడిచిన 9 ఏళ్లలో నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు జరుగుతున్నదంటే అది కాంగ్రెస్ వల్లేన‌న్నారు. కేసీఆర్ ఏం చేసినా ప్రజలు నమ్మరు అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది.. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకుంటామన్నారు. ఇంటి నిర్మాణానికి ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. తిరగబడదాం.. తరిమికొడదాం నినాదంతో ప్రజల్లోకి వెళదాం.. ప్రతీ గడపకు వెళ్లి.. ప్రతీ తలుపు తడదాం.. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొద్దామని పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Updated On 15 Aug 2023 3:20 AM GMT
Ehatv

Ehatv

Next Story