ఈ ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కాదని టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. వర్ధన్నపేట్(Wardhannapet ) ప్ర‌చార స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ ఎవడిపాలైంది.. ఎవడేలుతున్నడు అని జ‌నాల‌ను ప్ర‌శ్నించారు.

ఈ ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కాదని టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. వర్ధన్నపేట్(Wardhannapet ) ప్ర‌చార స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ ఎవడిపాలైంది.. ఎవడేలుతున్నడు అని జ‌నాల‌ను ప్ర‌శ్నించారు. ల్యాండ్ పూలింగ్(Land Pulling) పేరుతో భూములు గుంజుకున్న వ్యక్తి ఇక్కడి ఎమ్మెల్యే.. అదేమని ప్రశ్నించిన వారిని పోలీస్ బూటు కాలితో తన్నించిన వ్యక్తి అరూరి రమేష్(Aruri Ramesh) అని ప్ర‌జ‌ల‌తో అన్నారు. ఎన్నికలు వస్తున్నాయనే ల్యాండ్ పూలింగ్ జీవోను తాత్కాలికంగా ఆపేశార‌ని.. మళ్లీ ఓట్లు వేసి బీఆర్ఎస్(BRS) ను గెలిపిస్తే ఆ జీవోనే మీ మెడ మీద కత్తిగా మారి వేలాడుతుందని హెచ్చ‌రించారు.

స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి కోసం తెలంగాణ తెచ్చుకున్నమ‌న్నారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ దొర కాళ్ల కింద నలిగిపోతోందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చెప్పిండు.. కానీ కాళేశ్వరం పూర్తి కాకముందే మేడిగడ్డ కుంగింది, అన్నారం పగిలింది.. సుందిళ్లకు దిక్కులేదని అన్నారు. లక్ష కోట్లు దిగమింగి పేక మేడలు కట్టిండని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

బుద్ది ఉన్నవాడు ఎవడైనా ఇసుకపై బ్యారేజీ కడతాడా అని నిప్పులు చెరిగారు. నిజంగా ప్రమాదంతోనే ప్రాజెక్టు కూలితే.. ప్రజలకు ఎందుకు చూపించవు? అని ప్ర‌శ్నించారు. గజ్వేల్ లో కేసీఆర్‌ వంద‌ల గదులతో గడీని నిర్మించుకుండు.. జన్వాడలో 100 ఎకరాలలో కోట్లు ఖర్చు పెట్టి కేటీఆర్ ఒక గడీని కట్టుకుండు అని ఆరోపించారు.

ధనిక రాష్ట్రంలో ప్రతీనెలా మొదటి తారీఖు జీతాలు ఇవ్వలేని దుస్థితి నెల‌కొంద‌ని దుయ్య‌బ‌ట్టారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని కేసీఆర్ అంటుండు.. బిడ్డా కాంగ్రెస్ రాగానే కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్, దయాకర్ రావు, కవిత రావు ల కరెంట్ ఊడగొడుతం అని హెచ్చ‌రించారు. మీకు ఫ్యూస్ లే ఉండవు బిడ్డా కేసీఆర్.. కాంగ్రెస్ రాగానే మీ మోటర్లు కాలుతాయ్, మీ ట్రాన్స్ఫార్మర్స్ పేలుతాయ్ బిడ్డా అని హెచ్చ‌రించారు. చదువురాని దయాకర్ కేసీఆర్ చుట్టం అనే ఒక్క అర్హతతో మంత్రి అయిండని అన్నారు. ఈ ఎన్నికలు పోలీసులు, దొంగల మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అభివ‌ర్ణించారు. మీరు ఎవరివైపు ఉంటారో తేల్చుకోండన్నారు. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించండని పిలుపునిచ్చారు.

Updated On 14 Nov 2023 7:34 AM GMT
Ehatv

Ehatv

Next Story