Revanth Reddy : మేనిఫెస్టోనే కాంగ్రెస్కు భగవద్గీత.. ఖురాన్.. బైబిల్
కాంగ్రెస్(congress) శుక్రవారం ఎన్నికల మేనిఫెస్టో(Election Manifesto) విడుదల చేసింది. ఈ సందర్భంగా టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ కు ఈ ఎన్నికల మేనిఫెస్టోనే భగవద్గీత(Bhagavad Gita).. ఖురాన్(Quran).. బైబిల్(Bible) అని పేర్కొన్నారు. సర్వమతాలకు, తెలంగాణ ప్రజలకు ఈ మేనిఫెస్టో అంకితం చేస్తున్నామన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాశారని విమర్శించారు. పదేళ్లు అవకాశం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించారని.. నమ్ముకున్నవారికి ద్రోహం చేశారని మండిపడ్డారు.

Revanth Reddy

పదేళ్లలో ఒక అహంకారపూరిత పాలనను తెలంగాణ ప్రజలు చవిచూశారని అన్నారు. వెనక్కి తిరిగి చూసుకుంటే..పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ప్రజల పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారు. తెలంగాణలో కాంగ్రెస్ తుఫాను రాబోతోందన్నారు. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి.. అనే నినాదంతో ప్రజలు ముందుకొచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ కు గుణపాఠం చెప్పేందుకు ముందుకొస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ప్రజలు ఉన్నారని.. ఇందిరమ్మ రాజ్యంలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు.