ఈటెల రాజేందర్ రాజకీయంగా దిగజారి మాట్లాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికల్లో రూ.25 కోట్లు కాంగ్రెస్ కు కేసీఆర్ ఇచ్చారని రాజేందర్ దిగజారి మాట్లాడుతున్నారు. ఒక్క రూపాయి కూడా టీఆర్ఎస్ నుంచి గాని, కేసీఆర్ నుంచి సాయం పొందలేదని ఈటెల వ్యాఖ్యలను ఖండించారు.

Revanth Reddy challenge to Etela Rajendar
ఈటెల రాజేందర్(Etela Rajendar) రాజకీయంగా దిగజారి మాట్లాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికల్లో(Munugode Bypoll) రూ.25 కోట్లు కాంగ్రెస్(Congress) కు కేసీఆర్(KCR) ఇచ్చారని రాజేందర్(Rajendar) దిగజారి మాట్లాడుతున్నారు. ఒక్క రూపాయి కూడా టీఆర్ఎస్ నుంచి గాని, కేసీఆర్ నుంచి సాయం పొందలేదని ఈటెల వ్యాఖ్యలను ఖండించారు. మునుగోడు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయి కార్యకర్తలు చందాలు వేసుకున్నవేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలోని బలహీన వర్గాల నాయకులే మునుగోడు ఎన్నికలకు ఆర్ధిక సాయం చేశారన్నారు. వారి శ్రమను, ఆర్థిక సాయాన్ని అవమానించేలా ఈటెల మాట్లాడటం సమంజసం కాదని అన్నారు. బీజేపీ వాళ్లు భాగ్యలక్ష్మి అమ్మవారిని నమ్ముతారు. రేపు సాయంత్రం 6 గంటలకు వాళ్లు నమ్మే భాగ్యలక్ష్మి టెంపుల్(Bhagyalaxmi Temple) లో దేవుడిపై ఒట్టేసి చెబుతానని రేవంత్ అన్నారు.
నాపై ఆరోపణలను ఈటెల నిరూపించడానికి సిద్ధమా? అని సవాల్ విసిరారు. చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ లో తడి బట్టలతో ప్రమాణం చేయడానికి తాను సిద్ధం అని తెలిపారు. రాజకీయాల కోసం ఈటెల దిగజారి మాట్లాడటం క్షమించరాని నేరమన్నారు. నాపై ఆరోపణలను రాజేందర్ 24 గంటల్లో నిరూపించాలని.. రేపు సాయంత్రం 6 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ఈటెల సిద్ధంగా ఉండాలని అన్నారు. భాగ్యలక్ష్మి దేవుడిపై నమ్మకం లేకుంటే.. ఏ ఆలయంలో నైనా తడి బట్టలతో ప్రమాణానికి సిద్ధమని ఈటెలకు సవాల్ విసిరారు.
