Revanth Reddy : కామారెడ్డి భూములను కంచె వేసి కాపాడేందుకే నేను పోటీకి దిగాను
పదేళ్లుగా సీఎంగా ఉన్న కేసీఆర్(KCR), ఇక్కడి ఎమ్మెల్యే మిమ్మల్ని మోసం చేశారని టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. దోమకొండ రోడ్డు షో(Road Show) లో ఆయన మాట్లాడుతూ.. పేదలకు డబుల్ బెడ్రూంలు(Double Bedroom house) ఇవ్వలే, భూములకు పట్టాలు ఇవ్వలే..

Revanth Reddy
పదేళ్లుగా సీఎంగా ఉన్న కేసీఆర్(KCR), ఇక్కడి ఎమ్మెల్యే మిమ్మల్ని మోసం చేశారని టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. దోమకొండ రోడ్డు షో(Road Show) లో ఆయన మాట్లాడుతూ.. పేదలకు డబుల్ బెడ్రూంలు(Double Bedroom house) ఇవ్వలే, భూములకు పట్టాలు ఇవ్వలే.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలే.. కానీ ఇప్పుడొచ్చి ఆయనకు ఓటు వేయలని అడుగుతుండు.. పదేళ్లలో గుర్తురాని అమ్మగారి ఊరు కొనాపూర్(Konapur)ఆయనకు ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. ఏనాడూ గల్ఫ్ కార్మికులను, బీడీ కార్మికులను ఆదుకోలేదన్నారు.
సిద్దిపేట(Siddipet), సిరిసిల్ల(Sircila) కాదని కేసీఆర్ కామారెడ్డిలో పోటీకి దిగిండు.. ఇక్కడి రైతుల భూములు గుంజుకునెందుకే కేసీఆర్ కామారెడ్డికి వచ్చిండని.. ఎన్నికలున్నాయనే మాస్టర్ ప్లాన్ ను తాత్కాలికంగా రద్దు చేసిండని రేవంత్ అన్నారు. ఎన్నికల తరువాత మీ భూములను గుంజుకుంటడు.. కేసీఆర్ ను నమ్మడమంటే.. పాముకు పాలు పోసి పెంచినట్లేనన్నారు.
కేసీఆర్ పాము లాంటి వాడు.. ఓటు వేశారో.. మిమ్మల్ని కాటు వేస్తాడని అన్నారు. కామారెడ్డి భూములను కంచె వేసి కాపాడేందుకే.. నేను ఇక్కడ పోటీకి దిగానని తెలిపారు. కేసీఆర్ గెలిచినా.. ఓడినా ఫామ్ హౌస్ లొనే పడుకుంటాడు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు సంక్షేమ ఫలాలు అని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు.
