నీటి ప్రాజెక్టుల అంశంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేసే అంశంలో కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ లదే తప్పు అని విమర్శించారు. ఈ ముగ్గురు తాము చేసిన పాపాలు కప్పి పుచ్చి, ఆ పాపాలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వంపైకి నెట్టివేసి, ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు.కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68 శాతం, ఏపీలో 32 శాతం ఉంది. ఏ […]

నీటి ప్రాజెక్టుల అంశంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేసే అంశంలో కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ లదే తప్పు అని విమర్శించారు. ఈ ముగ్గురు తాము చేసిన పాపాలు కప్పి పుచ్చి, ఆ పాపాలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వంపైకి నెట్టివేసి, ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు.కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68 శాతం, ఏపీలో 32 శాతం ఉంది. ఏ ప్రాంతంలో ఎక్కువ నదీ పరీవాహక ప్రాంతం ఉంటుందో, అంత శాతం ఆ ప్రాంతానికి నీటి కేటాయింపులు ఉండాలని అంతర్జాతీయ విధివిధానాలు చెబుతున్నాయి. ఆ లెక్కన 500 పైచిలుకు టీఎంసీల నీరు తెలంగాణకు, 200 పైచిలుకు టీఎంసీల నీరు మాత్రమే ఏపీకి పోవాలి. కానీ పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉందన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు పెంచారని.. పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపునకు కేసీఆర్, హరీశ్ రావు సహకరించారని పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటి తరలింపునకు ఏపీ సీఎం జగన్ ప్రణాళిక వేశాడని తెలిపారు. 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలకు జీవో ఇచ్చారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీశైలం నుంచి నీళ్లే కాదు, బురద కూడా ఎత్తిపోసుకునేలా జగన్ యత్నాలు ఉన్నాయని అన్నారు. రోజుకు 8 టీఎంసీల నీరు తరలించుకుపోవాలన్నది జగన్ ప్రణాళిక అని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో ఏపీకి 8 టీఎంసీల నీరు తరలించడానికి కేసీఆర్ అనుమతించారని, ప్రగతిభవన్ లోనే జగన్, కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తో చీకటి ఒప్పందం మేరకే కేఆర్ఎంబీ సమావేశానికి కేసీఆర్ హాజరు కాలేదని, ఒప్పందం మేరకే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును కేసీఆర్ వ్యతిరేకించలేదని ఆరోపించారు. రాయలసీమ, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలకు కేసీఆర్ సహకరించారని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలోనే రెండు ప్రాజెక్టులు మొదలయ్యాయని, కేసీఆర్ పదవులు, కమీషన్లకు లొంగి జలదోపిడీకి సహకరించారని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.కొ న్నిరోజుల కిందట హైదరాబాదులో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం నిర్వహించగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఈఎన్సీలు, ఇతర ముఖ్య అధికారులు హాజరయ్యారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలు కేఆర్ఎంబీకి అప్పగించాలని ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు అంగీకరించారు.

Updated On 4 Feb 2024 9:22 PM GMT
Yagnik

Yagnik

Next Story