కేసీఆర్‌ అధికారంలోకి ఎట్లా వస్తడో ఆయన సంగతేందో చూస్తా.. పదేళ్లు నేనే సీఎంగా ఉంటా

కేసీఆర్‌ అధికారంలోకి ఎట్లా వస్తడో ఆయన సంగతేందో చూస్తా.. పదేళ్లు నేనే సీఎంగా ఉంటా, ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకో పదేళ్లు ఇందిరమ్మ రాజ్యమే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. చంద్రశేఖర్‌రావు.. నీకు సూటిగా సవాలు విసురుతున్నా..ఈ పదేళ్లలో నా ఒక్క వెంట్రుకనైనా పీకుతావేమో చూడు.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాసనసభకు రావడానికి చేతకాని కేసీఆర్‌ వీల్‌ చైర్లలో నల్లగొండ సభకు వెళ్లి సెంటిమెంట్‌ డ్రామాలకు తెర తీస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. పోలీసు, జైళ్లు, అగ్నిమాపక, ఎక్సైజ్, రవాణా శాఖల్లో కానిస్టేబుళ్లుగా ఎంపికైన మొత్తం 13,445 మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను సీఎం అందజేశారు.

ఉద్యోగ నియామకాలలో తప్పిదాలకు తావు లేకుండా, ఎవరికీ నష్టం లేకుండా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని.. టీఎస్‌పీఎస్సీలో గతంలో జరిగిన అక్రమాలను నిలువరిస్తామన్నారు. పదేళ్లుగా గ్రూప్‌–1 పరీక్ష నిర్వహించలేదని.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే 567 పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలు పెట్టామన్నారు. నిరుద్యోగులకు నష్టం జరగకుండా వయో పరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచామని అన్నారు. కంచర గాడిదలను ఇంటికి పంపించి రేస్‌ గుర్రాలను తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారని, ఆ కంచర గాడిద మళ్లీ అధికారం రావడం కలలో మాట.. అని శాసనసభలో ఒక అటెండర్‌ తనతో అన్నాడని తెలిపారు రేవంత్ రెడ్డి.

Updated On 14 Feb 2024 10:36 PM GMT
Yagnik

Yagnik

Next Story