నకిలీ వార్తలు ప్రచారం చేసే వారిని జైలులో పెట్టాలని బీఆర్ఎస్

నకిలీ వార్తలు ప్రచారం చేసే వారిని జైలులో పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తన బంధువుకు రూ.10 వేల కోట్ల కొవిడ్ కాంట్రాక్ట్ వచ్చిందని సీఎం ఆరోపించారని... ఆ తర్వాత సచివాలయం కింద నిజాం నగలు తవ్వుకున్నట్లుగా కథలు అల్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి (అమిత్ షా) ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేశారని విమర్శించారు. ఓయూకు చెందిన నకిలీ సర్క్యులర్‌ను కూడా పోస్ట్ చేశారన్నారు. ఇలాంటి నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్న వ్యక్తిని జైల్లో ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు.

1. Revanth manufactured a shameless Lie that my relative got 10000 crore Covid Drug Contract

2. ⁠The same Joker created Fake narrative that I dug Nizams jewels which were under Secretariat

3. ⁠Revanth circulated Fake Video of Union Home Minister

4. ⁠Being a CM he posted a Fake Circular of OU

Why shouldn’t this Habitual Fake News Peddler be put in a Jail ❓ అంటూ పోస్టు పెట్టారు కేటీఆర్. దీనికి కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

కొత్త ఆర్టీసీ లోగో అంటూ జరుగుతోన్న ప్రచారంపై కూడా కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఆర్టీసీ కొత్త లోగో అని చూపుతున్న వారిపై కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. రాజకీయ పెద్దల మాటలు విని సామాన్యులను వేధిస్తే కోర్టుకు లాగుతామని హెచ్చరించారు. టీజీఆర్టీసీ లోగో అని వాట్సాప్ గ్రూప్‌లో కాంగ్రెస్ వారే షేర్ చేసి ఆ తర్వాత అక్రమ కేసులు పెడుతున్నారని మరో ట్వీట్ లో ఆరోపించారు.

Updated On 24 May 2024 2:42 AM GMT
Yagnik

Yagnik

Next Story