ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పోటాపోటీగా బహిరంగ సభలు, కేటీఆర్‌కు ధీటుగా రోడ్డు షో లు నిర్వహిస్తున్నారు.

Revanth is campaigning in four constituencies today
ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) దూసుకుపోతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)కు పోటాపోటీగా బహిరంగ సభలు, కేటీఆర్(KTR)కు ధీటుగా రోడ్డు షో లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. నకిరేకల్(Nakirekal), తుంగతుర్తి(Thungathurthi), ఆలేరు(Aleru), కామారెడ్డి(Kamareddy) నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ప్రచార సభల్లో రేవంత్ పాల్గొంటారు.
ఉదయం 11 గంటలకు నకిరేకల్ బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటలకు తుంగతుర్తి బహిరంగసభ ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఆలేరు బహిరంగసభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.30లకు కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ, బీబీపేట కార్నర్ మీటింగ్ లలో రేవంత్ పాల్గొంటారు.
