టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈరోజు ఐదు నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

Revanth is campaigning in five constituencies today
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈరోజు ఐదు నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నిజామాబాద్ రూరల్(Nizamabad Rural), నారాయణ్ ఖేడ్(Narayanakhed), గజ్వేల్(Gajwel), కూకట్ పల్లి(Kukatpally), శేరిలింగంపల్లి(Sherilingampally) నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
మొదటగా ఉదయం 11 గంటలకు నిజామాబాద్ రూరల్ బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు నారాయణ్ ఖేడ్ బహిరంగసభకు హాజరవుతారు. ఆపై మధ్యాహ్నం 2 గంటలకు గజ్వేల్ బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు కూకట్ పల్లి రోడ్ షోలో పాల్గొంటారు. చివరగా సాయంత్రం 6 గంటలకు శేరిలింగంపల్లి రోడ్ షోలో పాల్గొని ప్రసంగిస్తారు.
