ఈ ఎన్నిక‌లు తెలంగాణ భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ ప్ర‌చార స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ..

ఈ ఎన్నిక‌లు తెలంగాణ(Telangana) భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. హుజూరాబాద్(Huzurabad) ప్ర‌చార స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. రాచరిక పాలన ఉండాలో.. ప్రజల ప్రభుత్వం ఉండాలో తేల్చే ఎన్నికలు ఇవ‌ని అన్నారు. సాదుకుంటరో.. సంపుకుంటరో అని దొంగ ఏడ్పులు ఏడ్చి గెలిచిన వ్యక్తి ఈటెల రాజేందర్ అని విమ‌ర్శించారు.

కేసీఆర్(KCR) తో యుద్ధం చేస్తానని గెలిచిన ఈటెల(Etela Rajendar) కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చారా? అని ప్ర‌శ్నించారు. ఎమ్మెల్సీ పదవి కోసం.. కమీషన్ల కోసం ఇక్కడో వ్యక్తి కాంగ్రెస్ కు ద్రోహం చేసిండని పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)పై ప‌రోక్ష విమ‌ర్శ‌లు చేశారు. ఎల్ ఎల్ సి పదవి కోసం, కమీషన్ ల కోసం పార్టీ కి ద్రోహం చేశాడని.. ఆ ఇద్దర్నీ చూసారు.. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ(Congress Party) అభ్యర్థికి ఓటు వేయండని పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే ఈ జిల్లాను పివి జిల్లా గా ప్రకటించే బాధ్యత కాంగ్రెస్ దని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామ‌న్నారు.

Updated On 23 Nov 2023 8:18 AM GMT
Yagnik

Yagnik

Next Story