తెలంగాణ పోలీస్ శాఖ లోగో మార్చారు. గతంలో ఉన్న తెలంగాణ స్టేట్ పోలీస్ అని ఉన్నదాన్ని మార్చి తెలంగాణ పోలీస్ అని మార్చారు.
తెలంగాణ పోలీస్ శాఖ లోగో మార్చారు. గతంలో ఉన్న తెలంగాణ స్టేట్ పోలీస్ అని ఉన్నదాన్ని మార్చి తెలంగాణ పోలీస్ అని మార్చారు. దీనిపై రకరకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం.నాగేశ్వరరావు ట్వీట్ చేశారు. ఈ లోగోలో తెలుగు లేదని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎక్స్‌లో ట్వీట్ చేస్తూ ' గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే జోక్యం చేసుకొని ఈ తెలంగాణ పోలీసు చిహ్నాన్ని వెంటనే ఉపసంహరించి, ఇంగ్లీషుతో పాటు తెలుగు కూడా ప్రముఖంగా ఉండేటట్లుగా కొత్త చిహ్నాన్ని పునఃరూపకల్పన చేయాలని డిజిపి గారిని ఆదేశించవలసిందిగా మా విజ్ఞప్తి' అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. అవును తెలుగును వాడాల్సిందని కొందరు కామెంట్ చేయగా.. ఆంధ్రప్రదేశ్ పోలీస్‌శాఖ లోగోలో కూడా తెలుగు లేదని నాగేశ్వరరావును ప్రశ్నించగా.. రెండు లోగోల్లో కూడా తెలుగు ఉండాలి అని ఆయన సమాధానం ఇచ్చారు.