కలియుగ వైకుంఠ వెంకటేశ్వరస్వామికి పునుగు పిల్లి తైలం అంటే ఇష్టమట. శుక్రవారం అభిషేకం తరువాత పునుగు పిల్లి తైలాన్ని గిన్నెసేవ పేరుతో స్వామి వారికి పూస్తారు. అందుకే పునుగు పిల్లి తైలం సేకరించి భద్రపరుస్తారు. దాని వల్లనే చెక్కుచెదరకుండా ఉండటంతోపాటు నిగనిగలాడుతూ ఉంటుందని తెలుస్తోంది. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ అరుదైన పునుగు పిల్లులను పెంచిపోషిస్తోంది.

హైదరాబాద్(Hyderabad) పాతబస్తీలో(Oldcity) అరుదైన పిల్లిజాతికి(Cat) చెందిన పునుగుపిల్లి(Punugupilli) ఓ ఇంట్లో దర్శనమివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దట్టమైన అడవుల్లో ఉండే పునుగుపిల్లి జనావాసాల్లోకి ఎలా వచ్చిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. వివరాల్లోకి వెళ్తే..రాత్రివేళ ఓ అపార్ట్‌మెంట్ పైపుల ద్వారా పైకి ఎక్కుతూ పునుగు పిల్లి జనం కంటపడింది. ఓ భవంతిని ఎక్కుతుండటాన్ని గుర్తించిన పరిసరవాసుల అరుదైన పిల్లి సమాచారాన్ని జూ(ZOO) అ‎ధికారులకు అందించారు. మొదట పిల్లి అనుకున్న స్థానికులు కాసేపు చూసిన తర్వాత పునుగు పిల్లిగా గుర్తించారు. ఆ పిల్లిని జాగ్రత్తగా పట్టుకొని, హైదరాబాద్ జూపార్క్ సిబ్బందికి కాల్ చేశారు. వెంటనే స్పందించిన జూ అధికారులు పునుగుపిల్లికి ఓ క్లాత్ చుట్టి జాగ్రత్తగా తీసుకెళ్లారు.

కలియుగ వైకుంఠ వెంకటేశ్వరస్వామికి పునుగు పిల్లి తైలం అంటే ఇష్టమట. శుక్రవారం అభిషేకం తరువాత పునుగు పిల్లి తైలాన్ని గిన్నెసేవ పేరుతో స్వామి వారికి పూస్తారు. అందుకే పునుగు పిల్లి తైలం సేకరించి భద్రపరుస్తారు. దాని వల్లనే చెక్కుచెదరకుండా ఉండటంతోపాటు నిగనిగలాడుతూ ఉంటుందని తెలుస్తోంది. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ అరుదైన పునుగు పిల్లులను పెంచిపోషిస్తోంది. ఈ పునుగు పిల్లులు శేషాచలం అడవుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ప్రస్తుతం పునుగు పిల్లులు అరుదైన జంతువుల జాబితాలో ఉన్నాయ.

1972లో కేంద్ర ప్రభుత్వం వన్య ప్రాణ సంరక్షణా చట్టం తెచ్చింది. టీటీడీ అధికారులు గోశాలలో పిల్లులను పెంచుకుంటూ వాటి నుంచి తైలాన్ని సేకరించేవారు. వన్య ప్రాణి అయిన పునుగు పిల్లిని పెంచుకోవడం చట్ట ప్రకారం తప్పు అంటూ జీవకారుణ్య పర్యావరణ సంరక్షణా సంఘాలు గోశాలలో పునుగు పిల్లుల పెంపకంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. దైవ కార్యక్రమాలకు వన్య ప్రాణుల సేవలను వినియోగించుకోవచ్చుననే క్లాజును ఆసరాగా చేసుకుని పునుగుపిల్లుల పెంపకానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి కేంద్ర జూ అధారిటీ అనుమతి ఇచ్చింది.

పునుగు పిల్లిని కొన్ని అటవీ తెగలవారు వేటాడి చంపి తింటున్నారు. ఈ కారణంగా భారత దేశంలో పునుగుపిల్లి జాతి అంతరించిపోయే దశలో ఉంది. అందుకే పునుగు పిల్లిని కలిగి ఉండటం చట్టరిత్యా నేరమని ప్రభుత్వ జీవో జారీ చేసింది. దేశంలో పునుగు పిల్లుల సంఖ్య పెరగాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించింది.

ఇంతకీ పునుగుపిల్లి పాతబస్తీకి ఎలా వచ్చింది? ఎవరైనా తెచ్చారా? లేక.. దానంతట అదే వచ్చిందా? స్మగ్లింగ్ జరుగుతోందా? ఇలా అనుమానాలు ఉన్నాయి. మొత్తంగా పునుగుపిల్లిని హైదరాబాద్ జూపార్క్ అధికారులు సురక్షితంగా తీసుకెళ్లడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated On 23 July 2023 4:15 AM GMT
Ehatv

Ehatv

Next Story