వేసవి కారణమో, లేక ట్రిపుల్‌ వన్‌ జీవో(GO 111) ఉససంహరణ కారణమో తెలియదు కానీ తెలంగాణ(Telangana)లో రిజిస్ట్రేషన్ల రాబడులు బాగా తగ్గాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌, మే మాసాలలో రిజిస్ట్రేషన్‌లు మందకొడిగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. నిజానికి ప్రభుత్వ ఆదాయ వనరులలో ఇదే రిజిస్ట్రేషన్‌ శాఖదే కీలకం. తెలంగాణ వచ్చిన తర్వాత రియల్‌ ఎస్టేట్‌ రంగం కూడా ఊపందుకుంది. రిజిస్ట్రేషన్లు కూడా బాగా పెరిగాయి.

వేసవి కారణమో, లేక ట్రిపుల్‌ వన్‌ జీవో(GO 111) ఉససంహరణ కారణమో తెలియదు కానీ తెలంగాణ(Telangana)లో రిజిస్ట్రేషన్ల రాబడులు బాగా తగ్గాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌, మే మాసాలలో రిజిస్ట్రేషన్‌లు మందకొడిగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. నిజానికి ప్రభుత్వ ఆదాయ వనరులలో ఇదే రిజిస్ట్రేషన్‌ శాఖదే కీలకం. తెలంగాణ వచ్చిన తర్వాత రియల్‌ ఎస్టేట్‌ రంగం కూడా ఊపందుకుంది. రిజిస్ట్రేషన్లు కూడా బాగా పెరిగాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనూ, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాలలో రియల్‌ ఎస్టేట్‌ రంగం పరుగులు పెడుతుండటంతో ఏటికేడు రాబడి పెరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ జరిగింది మాత్రం అందుకు భిన్నం. 2023-2024 ఆర్ధిక సంవత్సరానికి ఆదాయం 18 వేల కోట్ల రూపాయలను అధిగమిస్తుందని అంచనా వేశారు. 2022-2023లో 15,666 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్న అంచనా ఉన్నప్పటికీ వచ్చింది మాత్రం 14,180 కోట్ల రూపాయలే. స్థిరాస్తిపై పెట్టుబడులు తగ్గడంతో ఈ పరిస్థితి వచ్చింది. హైదరాబాద్‌ చుట్టుపక్కల భూములను కొనేవాళ్లలో ఎన్‌ఐఆర్‌లు ఎక్కువగా ఉంటారు. పెట్టుబడులకు దీన్నో మార్గంగా ఎంచుకుంటారు. అయితే ఈ ఆర్ధిక సంవత్సరంలో కీలకమైన వేసవిలో స్థిరాస్తి, సాగు భూముల క్రయ విక్రయాలు ఎక్కువగా ఉండాలి. కాని అలా జరగలేదు. ఏప్రిల్‌, మే మాసాలలో కొనుగోళ్లు పెద్ద ఎత్తున సాగుతాయని భావించారు. అయతే గతానికి భిన్నంగా ప్రస్తుత పరిస్థితి ఉంది. లాస్టియర్‌తో ఇదే సమయంతో పోలిస్తే గత రెండు నెలలలో ఆదాయం బాగా తగ్గింది. అయితే ఆస్తులు కొనాలనుకునేవారు ఏదో ఒక సమయంలో తప్పకుండా పెట్టుబడి పెడతారని, ఈ ఏడాది చివరికల్లా టార్గెట్‌ మేరకు రాబడి వస్తుందన్న నమ్మకంతో రిజిస్ట్రేషన్‌ శాఖ ఉంది.

Updated On 12 Jun 2023 1:56 AM GMT
Ehatv

Ehatv

Next Story