ఆసరా పెన్షన్లు వృద్దులకు సరైన సమయానికి అందక అల్లాడుతుంటే దాచుకున్న డబ్బుతో తప్పని పరిస్థితుల్లో రోడ్లు వేస్తున్నారు

రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District) ఫాబాద్(Shabad Mandal) మండ‌లం పోతుగ‌ల్ (Pothugal)గ్రామంలో ర‌హ‌దారి గుంత‌ల‌తో అస్త‌వ్య‌స్తంగా మారింది. ఆ రోడ్డును ఏ నాయ‌కుడు కానీ, అధికారులు కానీ ప‌ట్టించుకోలేదు. దీంతో వృద్ధులు ఆ గుంత‌ల‌ను పూడ్చేందుకు ముందుకొచ్చారు. గ్రామానికి చెందిన 200 మంది పింఛ‌న్ దారులు.. మ‌నిషికి రూ.20చొప్పున వేసుకుని డ‌బ్బులు పోగుచేశారు. ఆ డ‌బ్బులు పంచాయితీ కార్య‌ద‌ర్శికి అంద‌జేయ‌గా.. ఆయ‌న‌ ఆ డ‌బ్బుతో మ‌ర‌మ‌త్తులు పూర్తి చేశాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఓ వార్త ప‌త్రిక‌లో క‌థ‌నం రాగా.. అది కేటీఆర్ కంట ప‌డింది. దీంతో ఆ న్యూస్ క్లిప్‌ను ట్విట‌ర్‌లో షేర్ చేస్తూ.. కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు.

కేటీఆర్ ట్వీట్‌లో.. ఆసరైతున్న కేసీఆర్ ఆసరా పథకం

అవ్వా తాతలకే కాదు చివరకు గ్రామ పనులకు కూడా ఆసరైన ఆసరా పింఛన్

రోడ్లు వేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవా?

మాజీ సర్పంచుల సంగతి సరే చివరకు పంచాయతీ కార్యదర్శులు కూడా అప్పులపాలు కావల్సిందేనా రేవంత్

దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు.అలాంటి గ్రామాలను అభివృద్ది చేయాలని పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టింది కేసిఆర్ గారి ప్రభుత్వం

అలాంటి గొప్ప కార్యక్రమం పల్లె ప్రగతిని అటకెక్కించారా మహానుభావ?

ఆసరా పెన్షన్లు వృద్దులకు సరైన సమయానికి అందక అల్లాడుతుంటే దాచుకున్న డబ్బుతో తప్పని పరిస్థితుల్లో రోడ్లు వేస్తున్నారు

ఆసరా పెన్షన్ తో దాతలుగా సహాయం చేస్తే తప్ప రోడ్లు వేయలేని పరిస్థితి

ఎందుకు మీ పాలన- కొంచెం కూడా సిగ్గు అనిపిస్త లేదా! ఈ చిత్రం చూసి తలకాయ ఎక్కడ పెట్టుకుంటావో ఆలోచించుకో.. అంటూ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు.

ehatv

ehatv

Next Story