పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం ఆత్మీయ సన్మాన సభ నిర్వహించింది. మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్‌ చిరంజీవిని తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వాగ్ధాటికి నేను పెద్ద అభిమానినని చిరంజీవి అన్నారు. ఆయన మాటలు ఎందరినో ప్రభావితం చేస్తాయి. రాజకీయాల్లో ఆయన ఎంతో హుందాతనం చూపారు.. రాజకీయాల్లో హుందాతనం ఉండాలి. పాలిటిక్స్‌లో వ్యక్తిగత విమర్శలు తగవు... […]

పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం ఆత్మీయ సన్మాన సభ నిర్వహించింది. మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్‌ చిరంజీవిని తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వాగ్ధాటికి నేను పెద్ద అభిమానినని చిరంజీవి అన్నారు. ఆయన మాటలు ఎందరినో ప్రభావితం చేస్తాయి. రాజకీయాల్లో ఆయన ఎంతో హుందాతనం చూపారు.. రాజకీయాల్లో హుందాతనం ఉండాలి. పాలిటిక్స్‌లో వ్యక్తిగత విమర్శలు తగవు... ప్రస్తుత రాజకీయాలు వ్యక్తిగత విమర్శలతో నడుస్తున్నాయి. వ్యక్తిగత విమర్శల వల్లే నేను రాజకీయాల నుంచి బయటకు రావాల్సి వచ్చిందని చిరంజీవి తెలిపారు.

ఇక పద్మభూషణ్ వచ్చినప్పుడు ఉన్నంత సంతోషం పద్మవిభూషణ్ వచ్చినందుకు లేదన్నారు చిరంజీవి. అయితే ఆ తర్వాత ఎంతో మంది ప్రతిరోజు తనను ఆశీర్వదిస్తుంటే సంతోషం కలిగిందన్నారు. పద్మ అవార్డు గ్రహీతలకు ఇలా సన్మానం చేయడం ఇదే ప్రథమం. గద్దర్‌ పేరుతో నంది అవార్డులు ఇవ్వడం శుభ శూచకమన్నారు. నేడు తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయికి చేరాయని చిరంజీవి అన్నారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన ఒక్కొక్కరికి రూ.25లక్షల చొప్పున అందజేస్తామని చెప్పారు. వారికి ప్రతినెలా రూ.25వేల చొప్పున పెన్షన్ కూడా ఇస్తామని చెప్పారు. పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ వెళ్లే ప్రతి తెలుగు రాజకీయ నేతకు వెంకయ్య నాయుడు పెద్దదిక్కు అని అన్నారు సీఎం రేవంత్. ఆయన్ని సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. మెగాస్టార్‌ చిరంజీవి పున్నమినాగు సినిమాలో ఏస్థాయిలో నటించారో.. ఇటీవల వచ్చిన సైరాలోనూ అదే నటన కనబర్చారని చెప్పారు. ఈ పురస్కారం కార్యక్రమం రాజకీయాలకు అతీతమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.

Updated On 4 Feb 2024 4:32 AM GMT
Yagnik

Yagnik

Next Story