రవిప్రకాష్‌(Ravi Prakash) అంటే తెలుగుమీడియాలో ఓ సంచలనం.

రవిప్రకాష్‌(Ravi Prakash) అంటే తెలుగుమీడియాలో ఓ సంచలనం. ఆయన వార్త వేస్తే తెలుగురాష్ట్రాల్లో సుడిగాలిలా తిరుగుతుంది. అయితే ఆయన మూడు రోజుల క్రితం బిగ్‌ బ్రేకింగ్‌ అంటూ వేసిన వార్తపై తెలుగురాష్ట్రాల్లో విపరీతమైన చర్చజరిగింది. కవిత అరెస్ట్‌తో(Kavitha arrest) కేసీఆర్(KCR) ఆత్మరక్షణలో పడ్డారని, రేవంత్‌ సీఎం(revanth reddy) అయ్యాక స్కాముల పేరుతో కేసీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని, ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్లిపోతున్నారని అందుకే కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే బీఆర్‌ఎస్‌ను(BRS) బీజేపీలో(BJP) విలీనం చేయడమే శ్రేయస్కరమని కేసీఆర్‌ భావించారని రవిప్రకాశ్‌ చెబుతున్నారు. విలీనానికి సంబంధించి ఢిల్లీలో రెండు పార్టీల మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయని బాంబు పేల్చారు రవిప్రకాశ్‌.

అయితే దీనిపై బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా రవిప్రకాష్‌పై విరుచుకుపడ్డాయి. రవిప్రకాష్‌ను సోషల్‌ మీడియా వేదికగా ట్రోల్స్‌ చేశారు. పడతాం, లేస్తాం, నిలబడతాం, కొట్లాడుతాం అని కేటీఆర్‌ కూడా స్పందించారు. దీంతో మరింత రెచ్చిపోయాయి బీఆర్‌ఎస్‌ శ్రేణులు. రవిప్రకాష్ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఆర్‌టీవీని లక్ష్యంగా పెట్టుకున్నాయి. వాటికి సంబంధించిన ఎక్స్‌ అకౌంట్‌పై రిపోర్టుల మీద రిపోర్టులు కొట్టారు. అంతేకాకుండా ఆర్‌టీవీలో వస్తున్న వీడియోలపై కూడా రిపోర్టులు కొడుతున్నారు. దాదాపు 6.2 ఫాలోవర్స్‌ ఉన్న ఆర్‌టీవీ ట్వీట్ అకౌంట్‌పై రిపోర్టు కొట్టడంతో 'ఎక్స్' ఆ అకౌంట్‌ను సస్పెండ్‌ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిందని ఆర్‌టీవీ ఎక్స్‌ ఖాతాను సస్పెండ్‌లో పెట్టింది. ఎక్స్‌ అకౌంట్‌ సస్పెండయిన కారణాలకు సరైన వివరణ ఇస్తే సస్పెన్షన్ ఎత్తివేస్తారు. కాగా బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కార్యకర్తలు మాత్రం 'ఇది బీఆర్‌ఎస్‌ దెబ్బ.. ఆర్‌టీవీ అబ్బ' అంటూ రాసుకొచ్చారు. మరోసారి ఇలాంటి వార్తలు వండివార్చితే మా ప్రతాపమేంటో రవిప్రకాష్‌కు చూపిస్తామని హెచ్చరిస్తూ పోస్టులు చేస్తున్నారు. అంతేకాకుండా ఆర్‌టీవీకి సబంధించిన అన్ని సోషల్‌ మీడియా వేదికలపై రిపోర్టులు కొట్టాలని ఒకరినొకరు పిలుపునిచ్చుకుంటున్నారు. చూడాలి ఇది ఎంతవరకు దారితీస్తుందో.

Eha Tv

Eha Tv

Next Story