బీజేపీలో(BJP) బీఆర్‌ఎస్‌(brs) విలీనం కానుందా?

రవిప్రకాశ్‌ చెప్పిన బిగ్‌ బ్రేకింగ్‌... బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం.. తెలంగాణ రాజకీయాలలో పెను కుదుపు

బీజేపీలో(BJP) బీఆర్‌ఎస్‌(brs) విలీనం కానుందా? సుదీర్ఘకాలం పాటు తెలంగాణ కోసం అలుపెరగకుండా పోరాటం చేసిన నాటి టీఆర్‌ఎస్‌(TRS), పదేళ్ల పాటు తెలంగాణను పరిపాలించిన ఇప్పటి బీఆర్‌ఎస్‌(BRS) ఇక కనుమరుగు కానున్నదా? ఆ పార్టీ ఉనికి తెలంగాణలో లేకుండా పోతున్నదా? బీజీపీలో బీఆర్‌ఎస్‌ను విలీనం చేయడానికి అధినేత కేసీఆర్‌ సిద్ధమయ్యారా? ఈ ప్రశ్నలకు ఆర్‌టీవీ(RTV) రవిప్రకాశ్‌(Ravi Prakash) అవునని ఒక్క ముక్కలో చెప్పేశారు. మంగళవారం రాత్రి ఆయన ఈ వార్తను బ్రేక్‌ చేశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో, మరీ ముఖ్యంగా తెలంగాణలో దీనిపైనే చర్చ జరుగుతోంది. రాజకీయాల మీద ఆసక్తి, అభిరుచి వున్నవారంతా దీనిపైనే మాట్లాడుకుంటున్నారు. రవిప్రకాశ్‌ ఈ న్యూస్‌ను బ్రేక్‌ చేసి 12 గంటలకు పైనే అవుతోంది. ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ నేతల నుంచి దీనిపై ఎలాంటి రియాక్షన్‌ రాకపోవడంతోనే అనుమానాలు వస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ పెద్దలెవరూ స్పందించలేదు. విలీన వార్తలను ఖండించలేదు. రవిప్రకాశ్‌ చెబుతున్నదేమిటంటే... కవిత(Kavitha) అరెస్ట్‌తో కేసీఆర్(KCR) ఆత్మరక్షణలో పడ్డారని, రేవంత్‌ సీఎం అయ్యాక స్కాముల పేరుతో కేసీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని, ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్లిపోతున్నారని అందుకే కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేయడమే శ్రేయస్కరమని కేసీఆర్‌ భావించారని రవిప్రకాశ్‌ చెబుతున్నారు. విలీనానికి సంబంధించి ఢిల్లీలో రెండు పార్టీల మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయని బాంబు పేల్చారు రవిప్రకాశ్‌. ఇంతకు ముందు ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని రవిప్రకాశ్‌ చెప్పినవి నిజం కావడంతో విలీన వార్త కూడా నిజమయ్యే అవకాశం లేకపోలేదని కొందరు అంటున్నారు. దీనిపై బీఆర్‌ఎస్‌వైపు నుంచి స్పందన వస్తే తప్ప జరుగుతున్నదేమిటో తెలియదు. మొత్తంమీద తెలంగాణలో అయితే దీనిపై వాడివేడి చర్చ జరుగుతోంది.

Eha Tv

Eha Tv

Next Story