మేడారం(Medaram) భక్తులతో కిక్కిరిసిపోతున్నది. జాతర ఇంకా మొదలు కాలేదు కానీ అప్పుడే అక్కడ జనసందోహం నెలకొంది. ఇదే సమయంలో మేడారంలో ఖాళీ స్థలాల రెంట్ల రేట్లు(Rent price) బీభత్సంగా పెరిగాయి. చుట్టుపక్కల భూములకు డిమాండ్ పెరిగింది. జాతరకు చాలా రోజుల ముందే స్థానికుల దగ్గర నుంచి కొందరు ఎకరం నుంచి అయిదు ఎకరాల వరకు భూములను అద్దెకు తీసుకుంటారు. ఆ స్థలాలలో చిన్న చిన్న గుడారాలు వేస్తారు.
మేడారం(Medaram) భక్తులతో కిక్కిరిసిపోతున్నది. జాతర ఇంకా మొదలు కాలేదు కానీ అప్పుడే అక్కడ జనసందోహం నెలకొంది. ఇదే సమయంలో మేడారంలో ఖాళీ స్థలాల రెంట్ల రేట్లు(Rent price) బీభత్సంగా పెరిగాయి. చుట్టుపక్కల భూములకు డిమాండ్ పెరిగింది. జాతరకు చాలా రోజుల ముందే స్థానికుల దగ్గర నుంచి కొందరు ఎకరం నుంచి అయిదు ఎకరాల వరకు భూములను అద్దెకు తీసుకుంటారు. ఆ స్థలాలలో చిన్న చిన్న గుడారాలు వేస్తారు. వాటిని భక్తులకు రెంట్‌కు ఇస్తారు. ఒక్క గుడారానికి(Tent) దాని సైజును బట్టి అయిదు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. మేడారం చిన్న గ్రామం కాబట్టి అక్కడ లాడ్జీలు, సత్రాలు, హోటల్స్ ఉండవు. అందుకే జాతర సమయంలో స్థానికులు తమ ఇళ్లను అద్దెకు ఇస్తారు. పది రోజుల నుంచి 20 రోజుల వరకు అద్దెకు ఇస్తారు. ఈ సమయంలో రెంటు పది వేల రూపాయల నుంచి 30 వేల రూపాయల వరకు ఉంటుంది. ఇంతకు ముందంటే జాతరకు ఎడ్లబండ్లలో వచ్చేవారు. ఆ బండ్లను నిలిపిన చోటే గుడారాలు వేసుకుని విడిది చేసేవారు. ఇప్పుడు ఎడ్లబండ్లు లేవు. అందుకే ఖాళీ స్థలాలకు డిమాండ్ పెరిగింది. జాతర ఉన్నప్పుడు ఇక్కడున్న రైతులు పంటలు వేయరు. రోడ్డుసైడు ఉన్న స్థలాలకు అయితే మస్తు డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం మేడారంలో గతం స్థలం అద్దెకు ఎనిమిది వేల రూపాయల నుంచి పది వేల రూపాయలు వరకు ఉంది. మేడారం పరిసర ప్రాంతాలలో ఇప్పటికే కొన్ని కిరాణా షాపులు, కూల్ డ్రింక్ షాపులు, చిన్న చిన్న హోటళ్లు, బెల్లం దుకాణాలు, చికెన్ సెంటర్లు వెలిశాయి.