అతగాడు నిజమైన భారతీయుడు(Indian). అందుకే లంచగొండి భార్య(Corrupted wife) బండారం బయటపెట్టాడు.

అతగాడు నిజమైన భారతీయుడు(Indian). అందుకే లంచగొండి భార్య(Corrupted wife) బండారం బయటపెట్టాడు. ఈ చిత్రమైన ఘటన రంగారెడ్డి(Ranga reddy) జిల్లాలో జరిగింది. మణికొండ మున్సిపల్‌ డీఈఈగా(DEE) పని చేస్తున్న తన భార్య దివ్యజ్యోతి ప్రతిరోజూ లంచం(Bribe) తీసుకుంటున్నదంటూ ఆమె భర్తే చెప్పారు. ఇంట్లో గుట్టలు గుట్టలుగా ఉన్న డబ్బుల కట్టల వీడియోలను విడుదల చేశాడు భర్త శ్రీపాద్‌. తన భార్య జ్యోతి రోజూ లక్షల్లో లంచం తీసుకుంటుందని, ఏడేళ్ల నుంచి లంచం తీసుకోవద్దని వద్దని వారించినా భారీ మొత్తంలో డబ్బులు తీసుకోవడం తనని మనోవేదనకు గురి చేస్తున్నదంటూ ఆ వీడియోలో తెలిపారు. సుమారు 80లక్షల రూపాయల విలువైన నోట్ల కట్టలు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ దాచిపెట్టిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. మణికొండలోని కాంట్రాక్టర్ల దగ్గర నుంచి పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకుంటున్నదని, ఇంటికి భారీగా లంచాలు తీసుకువస్తున్నదని శ్రీపాద్‌ ఆరోపించారు.

ఇదే విషయంలో జ్యోతితో గొడవ పడ్డానని, అయినా ఆమెలో మార్పురాలేదన్నారు. పైగా తాను లంచం తీసుకోకూడదు అని అనుకున్నా.. పై అధికారులు లంచం తీసుకోమని ప్రోత్సహిస్తున్నారని చెబుతున్నదని వాపోయారు. మరోవైపు జ్యోతిపై అవినీతి ఆరోపణలు వెలుగులోకి రావడంతో రెండు రోజుల క్రితం ఆమెను జీహెచ్‌ఎంసీకి బదిలీ చేశారు.

Updated On 9 Oct 2024 11:49 AM GMT
Eha Tv

Eha Tv

Next Story