హైదరాబాద్‌లోని(Hyderabad) ప్రతిష్టాత్మక ది హైదరాబాద్‌ జింఖానా క్లబ్‌ ఎన్నికలలో(Gymkhana Club elections) రమేశ్‌బాబు కొండ్రగుంట(Ramesh Babu Kondragunta) ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా వీరమాచినేని సత్యనారాయణ(Veeramachineni Satyanarayana) ఎన్నికయ్యారు. క్లబ్‌ ఛైర్మన్‌గా కె. రమేశ్‌బాబు 626 ఓట్ల తో విజయం సాధించారు.

హైదరాబాద్‌లోని(Hyderabad) ప్రతిష్టాత్మక ది హైదరాబాద్‌ జింఖానా క్లబ్‌ ఎన్నికలలో(Gymkhana Club elections) రమేశ్‌బాబు కొండ్రగుంట(Ramesh Babu Kondragunta) ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా వీరమాచినేని సత్యనారాయణ(Veeramachineni Satyanarayana) ఎన్నికయ్యారు. క్లబ్‌ ఛైర్మన్‌గా కె. రమేశ్‌బాబు 626 ఓట్ల తో విజయం సాధించారు. ఆయనపై పోటీ చేసిన నాగ కిశోర్‌కు 543 ఓట్లు లభించాయి. వైస్‌ చైర్మన్‌గా పోటీ చేసిన చందుపట్ల సత్యనారాయణరెడ్డికి 631 ఓట్లు లభిస్తే, ఆయనతో పోటీపడిన మోతె కిషన్‌రెడ్డికి 505 ఓట్లు వచ్చాయి. కార్యదర్శిగా వీరమాచినేని సత్యనారాయణకు 740 ఓట్లు వచ్చాయి. ఈయనపై పోటీకి దిగిన పావులూరి అచ్యుతరామయ్యకు 431 ఓట్లు లభించాయి. సంయుక్త కార్యదర్శిగా పోటీ చేసిన ఆర్‌.కృష్ణ మోహన్‌కు 629 ఓట్లు రాగా ఆయనపై పోటీ చేసిన జూపల్లి సతీష్‌కుమార్‌కు 528 ఓట్లు దక్కాయి. డైరెక్టర్లుగా కామేపల్లి వెంకట చలమయ్య, దొడ్డ మధుబాబు, వడ్లపట్ల మోహన్‌, వై. సీతారామరాజు, సోమా నర్సింహారెడ్డి కోడూరు అలియాస్‌ కెఎస్‌ఎన్‌.రెడ్డి, కర్నాటి వెంకటేశ్వరరావు విజయం సాధించారు.

Updated On 10 Oct 2023 4:53 AM GMT
Ehatv

Ehatv

Next Story