బీసీ సామాజికవర్గాలకు(BC Comminity) 42 శాతం రిజర్వేషన్లు కేటాయించకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలు(ELections) నిర్వహిస్తే ఊరుకునేది లేదని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్‌(Raja ram Yadav) తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకోకపోతే సెక్రటేరియట్‌ను(Secreteriat) ముట్టడిస్తామని హెచ్చరించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వివిధ ప్రజాసంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు రాజారాం యాదవ్‌.

బీసీ సామాజికవర్గాలకు(BC Comminity) 42 శాతం రిజర్వేషన్లు కేటాయించకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలు(ELections) నిర్వహిస్తే ఊరుకునేది లేదని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్‌(Raja ram Yadav) తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకోకపోతే సెక్రటేరియట్‌ను(Secreteriat) ముట్టడిస్తామని హెచ్చరించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వివిధ ప్రజాసంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు రాజారాం యాదవ్‌. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కులగణన చేపట్టి, 42 శాతానికి రిజర్వేషన్లు పెంచుతామని, ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పి, ఇప్పుడు మాట మారుస్తారని రాజారాం విమర్శించారు. ఇది బీసీల గొంతు కోయడమనని అన్నారు. లోక్‌సభ ఎన్నికల(Lok sabha Elections) ప్రచారంలోనే జూన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామంటూ రేవంత్‌ ్రకటించడం, ఎన్నికల కమిషన్‌, అధికార యంత్రాగానికి ఆదేశాలు ఇవ్వడం వెనుక రాజకీయంగా బీసీలను అణచివేసే కుట్ర దాగి ఉందని చెప్పారు. బీసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ఇంకా ఎంతకాలం కాలరాస్తారని ప్రశ్నించారు. బీసీలను సామాజిక న్యాయానికి దూరం చేసి, అంటరానివాళ్లుగా చూసిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 33 శాతం ఉన్న రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జానారెడ్డి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే రిజర్వేషన్లు 23 శాతానికి తగ్గించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అప్పటి ప్రభుత్వం, అడ్వకేట్ జనరల్ సీ.వీ.మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డిలు సరిగ్గా వాదించకపోవడం, కుట్రపూరితంగా కేసు నీరుగార్చడం వల్లే హైకోర్టులో బీసీలకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నారు రాజారాం యాదవ్‌. సుప్రీం కోర్టులో ప్రభుత్వం ఎందుకు సవాల్ చేయలేదని ప్రశ్నించారు. అసెంబ్లీ, లోక్‌సభ సీట్లలో పోటీ చేయడానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వని ఆధిపత్య కుల పార్టీలు.. స్థానిక సంస్థల్లోనూ బీసీల ప్రాతినిథ్యాన్ని అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేయకపోతే జూన్ 15న సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని ప్రభ్యత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ జనసభ రాజారాం యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్ గౌడ్, బీసీ టైమ్స్, బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యారావు, మున్నూరుకాపు సంఘం నాయకులు పురుషోత్తం పటేల్, టి జర్నలిస్ట్ ఫోరమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల క్రిష్ణ, ఓయూ విద్యార్థి నాయకుడు లింగం శాలివాహన, యాదవ సంక్షేమ సంఘం నాయకులు మధు యాదవ్, మల్లేష్ యాదవ్, టీవైజేఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శెట్టి హరికృష్ణ యాదవ్, విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర నాయకులు కొంపెల్లి రాజు, మల్లేష్, ఆరె కటిక సంఘం నాయకులు సంతోష్ పాల్గొన్నారు.

Updated On 18 May 2024 6:12 AM GMT
Ehatv

Ehatv

Next Story