తెలంగాణ(Telangana)లో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు(Job Notifications) ఇవ్వాలని డిమాండ్ చేస్తూ..విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో ఓయూ విద్యార్థి నాయకులు, పలు సంఘాలు TGPSC ముట్టదించాయి.
తెలంగాణ(Telangana)లో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు(Job Notifications) ఇవ్వాలని డిమాండ్ చేస్తూ..విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో ఓయూ విద్యార్థి నాయకులు, పలు సంఘాలు TGPSC ముట్టదించాయి. Rajaram yadav demand to cm revanth reddy on jobs notifications for un employedఎదుట ఆందోళనకు దిగాయి. అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) సమయంలో కేవలం ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ(Congress Party) మోసపూరిత వాగ్ధానాలు చేసిందని విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రాజారాం యాదవ్(Raja Ram Yadav) విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలొనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి(Revanth Reddy)..ఇప్పుడు నిరుద్యోగులను పూర్తిగా గాలికొదిలేశారన్నారు. ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసే కార్యక్రమంలో బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి.. నిరుద్యోగులను పట్టించుకునే పరిస్థితుల్లో లేరని మండిపడ్డారు. తేదీలతో సహా కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్(Job Calendar) ఏమైందని ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వం(Revanth Govt) నిరుద్యోగులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ..వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని రాజారాం యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 లక్షల ఉద్యోగాల కోసం తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొంపెళ్లి రాజు, ఓయూ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ ఎల్చాల దత్తాత్రేయ, ఓయూ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ నాయకులు మన అశోక్ యాదవ్, లింగం శాలివాహన, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు జక్కుల మధు తదితరులు పాల్గొన్నారు.