Raja Singh : నేడు నగరంలో రాజా సింగ్ 'హిందూ ఆక్రోశ్ ర్యాలీ'
బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువుల భద్రత కోసం గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఈరోజు హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహిస్తున్నారు
బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువుల భద్రత కోసం గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఈరోజు హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహిస్తున్నారు. 'హిందూ ఆక్రోశ్ ర్యాలీ' పేరుతో ఈ ర్యాలీ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. కోటీ మహిళా కళాశాల సమీపంలోని బాలగంగాధర్ తిలక్ విగ్రహం వద్ద ర్యాలీ ప్రారంభమై కాచిగూడ ఎక్స్‌రోడ్డు వీర్ సావర్కర్ విగ్రహం వద్ద ముగుస్తుందని ఎమ్మెల్యే రాజా సింగ్ వెల్లడించారు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో హిందువులపై దాడులు జరుగుతున్నాయని రాజా సింగ్ ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోలో పేర్కొన్నారు. ఇటీవల బీజేపీ నాయకురాలు మాధవీ లత కూడా బంగ్లాదేశ్‌లోని హిందువులకు సంఘీభావం తెలిపేందుకు ఓల్డ్ మలక్‌పేటలో ర్యాలీ చేపట్టారు.
🚩 Hindu Aakrosh Rally 🚩
— Raja Singh (@TigerRajaSingh) August 17, 2024
We request every to join us in a Rally against the ongoing Genocide of Hindus in Bangladesh. Let’s come together and raise our voices.
🗓️ Date: 18-08-2024
🕒 Time: 3:00 PM
📍 Route: From Bal Gangadhar Tilak Statue, Near Koti Women's College, to… pic.twitter.com/tXM0Tmej0i
ఇదిలావుంటే.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు, నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ ఢాకాలోని చారిత్రాత్మక ఢాకేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ బంగ్లాదేశ్‌లోని మైనారిటీలకు భద్రత గురించి హామీ ఇచ్చారు. “హక్కులు అందరికీ సమానం. మేమందరం సమాన హక్కు కలిగి ఉన్న ప్రజలం. మా మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు కల్పించవద్దు. దయచేసి మాకు సహాయం చేయండి. ఓపిక పట్టండి. తరువాత తీర్పు చెప్పండి. మనం ఏమి చేయగలమో.. చేయలేమో.. మేము విఫలమైతే.. మమ్మల్ని విమర్శించండి”అని ప్రొఫెసర్ యూనస్ చెప్పినట్లు బంగ్లాదేశ్ వార్తాపత్రిక డైలీ స్టార్ పేర్కొంది. అయితే.. బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. రాజా సింగ్‌తో సహా నాయకులు హైదరాబాదులో ర్యాలీలు నిర్వహిస్తున్నారు.