ఎండలు దండిగా ఉండాల్సిన వేసవిలో విచిత్రంగా వానలు మొదలయ్యాయి . తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సాన్నీ సృష్టిస్తున్నాయి . గత రెండు రోజులుగా అటు ఆంధ్ర(Andhra) ,ఇటు తెలంగాణ (Telangana)రాష్ట్రాలతో పాటు దేశంలో కూడా చాలా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి . నిన్న మొన్నటి వరకు వేసవి ఎండలకు విసిగిపోయిన జనం ప్రస్తుతం వర్షాలతో భయపడుతున్నారు . అకాలంగా కురుస్తున్న వర్షాలు జన జీవనం అస్తవ్యస్తంగా మారింది.

గత రెండు రోజులుగా రాష్ట్రాల్లోని పలు చోట్ల ఒక మోస్తరు నుండి భారీగా వర్షాలు కురిశాయి . అకాలంగా కురుస్తున్న వర్షాలకు రైతులు భారీగా నష్టపోతున్నారు . పంట పొలాలు నీట మునిగిపోయాయి . చేతికి రావాల్సిన పంట కళ్ళముందే నాశనమై పోయింది . ఒక పక్క గ్రామాల పరిస్థితి అలా ఉంటే ,మరో పక్క హైదరాబాద్ (Hyderabad)నగర వాసుల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది .వర్షాల కారణంగా కాలువలు ,డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి . కొన్ని కాలనీల్లో ప్రజలు ఇళ్లలోకి డ్రైనేజ్ వాటర్ చేరటంతో బయటకురాలేని పరిస్థితి . వర్షాల కారణంగా కార్లు ,బైకులు వర్షం నీటిలో కొట్టుకొనిపోతున్నాయి . మాన్ హోల్ లో పడి దుర్మరణాలు పాలవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి . కొన్నిచోట్ల భారీగా కురుస్తున్న వర్షాలకు పురాతన కట్టడాలు ,ఇంటి గోడలు కూలిపోతున్నాయి .

ఈదురు గాలుల ప్రభావంతో పలు ప్రధాన రహదారుల్లో ,వీధుల్లో సైతం కరెంటు స్తంబాలు ,తీగలు నేలకు ఒరుగుతున్నాయి. పెద్ద పెద్ద చెట్లు గాలి దాటికి పడిపోతున్నాయి . దీనితో ఉదయాన్నే పనులకు వెళ్లే వారికి తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు . వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది . చాలా చోట్ల గంటలు తరబడి కరెంటు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు . మరి కొన్ని ప్రదేశాలలో తాగునీటి సమస్యను ఎదుర్కుంటున్నారు .

అర్ధరాత్రి అకస్మాత్తుగా భారీ వర్షాలు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే తాజాగా మరో నాలుగు రోజుల పాటు తెలుగురాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది . రాష్ట్ర ప్రజలు ముందస్తు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది .

Updated On 1 May 2023 1:53 AM GMT
rj sanju

rj sanju

Next Story