మృగశిర కార్తె(Mrigashira Karte) వచ్చేసింది. నింగిలో మబ్బులు వస్తున్నాయి. ఉత్తర చత్తీస్‌గఢ్(Chhattisgarh) నుంచి తెలంగాణ(telangana) మీదుగా కర్ణాటక వరకు కొనసాగుతున్న ద్రోణి గురువారం బలహీనపడింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు అక్కడక్కడా ఉరుములు(thunder), మెరుపులు(Lightning), ఈదురు గాలులత కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంటోంది.
మృగశిర కార్తె(Mrigashira Karte) వచ్చేసింది. నింగిలో మబ్బులు వస్తున్నాయి. ఉత్తర చత్తీస్‌గఢ్(Chhattisgarh) నుంచి తెలంగాణ(telangana) మీదుగా కర్ణాటక వరకు కొనసాగుతున్న ద్రోణి గురువారం బలహీనపడింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు అక్కడక్కడా ఉరుములు(thunder), మెరుపులు(Lightning), ఈదురు గాలులత కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంటోంది. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గత 24 గంటల్లో గద్వాల జిల్లా జూరాలలో అయిదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి జిల్లా ఖిలా ఘన్‌పూర్‌లో 4, నల్లగొండ జిల్లా దేవరకొండలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు ఇవాళ ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, కొత్తగూడెం, అదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.