గతవారం తెలుగు రాష్ట్రాల్లో వానలు(rains)జోరుగాకురిసాయి. అకాల వర్షం తో భారీ పిడుగులతో రైతులు భారీగా నష్టాన్ని చూసారు . రానున్న రోజుల్లో కూడా వర్షాలు తప్పవని వాతావరణశాఖ తెలిపింది .తెలంగాణలో మార్చి 24,25 తేదీల్లో వర్షాలు కురుస్తాయి అని చెప్పింది వాతావరణశాఖ . సోమవారం తమిళనాడు నుంచి ఉన్న ద్రోణి మంగళవారం(Tuesday) నాటికి దక్షిణ శ్రీలంక నుంచి తమిళనాడు, రాయలసీమ, తెలంగాణ మీదుగా మధ్యప్రదేశ్ వరకు విస్తరించింది. దీనితో మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొనడం […]

గతవారం తెలుగు రాష్ట్రాల్లో వానలు(rains)జోరుగాకురిసాయి. అకాల వర్షం తో భారీ పిడుగులతో రైతులు భారీగా నష్టాన్ని చూసారు . రానున్న రోజుల్లో కూడా వర్షాలు తప్పవని వాతావరణశాఖ తెలిపింది .తెలంగాణలో మార్చి 24,25 తేదీల్లో వర్షాలు కురుస్తాయి అని చెప్పింది వాతావరణశాఖ . సోమవారం తమిళనాడు నుంచి ఉన్న ద్రోణి మంగళవారం(Tuesday) నాటికి దక్షిణ శ్రీలంక నుంచి తమిళనాడు, రాయలసీమ, తెలంగాణ మీదుగా మధ్యప్రదేశ్ వరకు విస్తరించింది. దీనితో మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొనడం జరిగింది .

తెలంగాణ రాష్ట్రం(Telangana)లోకొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశంఉంటుందని హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని చెప్పారు. అలాగే, 25వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్(yellow Alert) కూడా వాతావరణశాఖ జారీ చేసింది. గతంలో కురిసిన వర్ష ప్రభావం వల్ల రాత్రిపూట ఉష్ణోగ్రత లు బాగా తగ్గాయి. చలి విషయంలో కూడా రాష్ట్రం మొత్తం సాధారణ ఉష్ణోగ్రతలే ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో మాత్రం నేడు చలి విషయంలో ఎల్లోఅలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ .

హైదరాబాద్ (Hyderabad)లో ఆకాశం మేఘాలతో నిండి ఉంటుంది. ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. రాత్రి సమయంలో ఉరుములు చిరుజల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు(temperature) వరుసగా 34 డిగ్రీలు, 21 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది.చల్లని గాలులు వీచే అవకాశం కూడా ఉంది . వర్షాలతో మరోసారి హైదరాబాద్ నగరం ఆహ్లదంగా మారబోతుంది .

ఏపీలోని(andhrapradesh) దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై జల్లులు పడుతున్నాయి. నేడు కూడా ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నాయి.కొన్ని ప్రాంతాలకు దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని(amaravati) వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణంగా 32డిగ్రీల నుండి 35 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. వర్షాలతో పాటు గాలులు కూడా 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి .

Updated On 23 March 2023 2:33 AM GMT
rj sanju

rj sanju

Next Story