తెలంగాణలోని కొన్ని జిల్లాలలో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని
తెలంగాణలోని కొన్ని జిల్లాలలో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో పాటూ.. పిడుగులు కూడా పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో గంటకు 30 కిలో మీటర్ల నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. నేడు జగిత్యాల, మహబూబాబాద్, ఆదిలాబాద్, సిరిసిల్ల, నిర్మల్, నిజామాబాద్, గద్వాల, వరంగల్, హనుమకొండ, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం అయింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఏపీలో నేడు మన్యం, అల్లూరి, అనకాపల్లి, కృష్ణా, కర్నూల్, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
మే నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 31న కేరళను తాకనున్నాయని, ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయని ఐఎండీ భావిస్తోంది. నైరుతి రుతుపవనాలు మే 1న కేరళను తాకడం ముందస్తు కాదని, సాధారణ తేదీకి సమీపంగా ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవనుందని గత నెలలో ఐఎండీ అంచనా వేసింది.