అసెంబ్లీ ఎన్నికల్లోలాగే ఇప్పుడు ఈ వేదికపై జాతీయ స్థాయిలో ఐదు గ్యారంటీలను ఆవిష్కరించామ‌ని రాహుల్ గాంధీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లోలాగే ఇప్పుడు ఈ వేదికపై జాతీయ స్థాయిలో ఐదు గ్యారంటీలను ఆవిష్కరించామ‌ని రాహుల్ గాంధీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం జాతీయ స్థాయిలోనూ గ్యారంటీలను అమలు చేస్తామ‌న్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మాత్రమే కాదు.. భారత దేశ ఆత్మ అన్నారు. ఈ మేనిఫెస్టో దేశ ముఖచిత్రాన్ని మార్చేస్తుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనారిటీల జీవితాల్లో వెలుగులు తీసుకోస్తామ‌న్నారు.

యువ న్యాయం పథకం ద్వారా జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామ‌న్నారు. దేశంలో విద్యావంతులైన యువతకు నెలకు రూ.8500 ఉపకారవేతనంతో ఏడాదిపాటు అప్రంటీస్ షిప్ శిక్షణ అందిస్తామ‌న్నారు. మహిళా న్యాయం పథకం ద్వారా ప్రతీ పేద మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు అందిస్తామ‌న్నారు. దేశంలో ప్రతీ రోజు 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు.

మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు 16 లక్షల కోట్లు మాఫీ చేసిందన్నారు. కానీ రైతుల రుణాలు మాత్రం మాఫీ చేయలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. రైతు న్యాయం పథకం ద్వారా రైతు రుణాల మాఫీ చేస్తామ‌న్నారు. స్వామినాథన్ కమిటర్ సిఫార్సుల ప్రకారం పంటలకు మద్దతు ధర కల్పిస్తామ‌న్నారు. కార్మిక న్యాయం ద్వారా కార్మికులకు సామాజిక, ఉద్యోగ భద్రత కల్పిస్తామ‌న్నారు. దేశంలో 50 శాతం వెనుకబడిన వర్గాలున్నాయన్నారు. 15 శాతం దళితులు, 8 శాతం గిరిజనులు, ఆదివాసీలు ఉన్నారు. 15 శాతం మైనారిటీలు ఉన్నారు.. 5 శాతం ఇతర పేద వర్గాలు ఉన్నాయన్నారు.

మోదీ పాలనలో దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు సమన్యాయం జరగడం లేదన్నారు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశ వ్యాప్తంగా కులగణన చేపడతామ‌న్నారు. కులగణన దేశానికి ఎక్స్ రే లాంటిదన్నారు. సామాజిక , ఆర్థిక అంశాలతో కూడిన కుల గణన చేపడతామ‌న్నారు. దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తామ‌న్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ 50 శాతం మించకూడదనే పరిమితిని తొలగిస్తామ‌న్నారు. తెలంగాణలో గత ప్రభుత్వం వేల మంది ఫోన్స్ ను ట్యాప్ చేసిందన్నారు. మాజీ సీఎం ఇంటెలిజెన్స్, పోలీస్ వ్యవస్థను ఎలా దుర్వినియోగం చేశారో మీరు చూశారు.. ఫోన్ ట్యాపింగ్ డేటాను ధ్వంసం చేశారు. ఇక్కడ కేసీఆర్ లాగే కేంద్రంలో మోదీ ప్రభుత్వం కూడా అదే పని చేస్తోంది. ఈడీని బలవంతపు వసూళ్ల సంస్థగా మార్చేశారన్నారు. ఎలక్ట్రోరల్ బాండ్స్ రద్దు ఒక పెద్ద కుంభకోణమ‌న్నారు. సీబీఐ పేరుతో భయపెట్టి కంపెనీల నుంచి పార్టీ ఫండ్ వ‌సూలు చేస్తున్నామ‌న్నారు.

తెలంగాణలో బీజేపీ బీ టీమ్ ను ఓడించాం.. ఇప్పుడు కేంద్రంలో బీజేపీని ఓడించబోతున్నామ‌న్నారు. రాజ్యాంగం ప్రజలకు రక్షణ.. కానీ బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తోందన్నారు. మేం రాజ్యాంగాన్ని రద్దు చేయనీయబోమన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడుతామ‌న్నారు. బీజేపీ వైపు కార్పొరేట్ కంపెనీలు, ధనం ఉంది.. ఇవేవీ లేకపోయినా కాంగ్రెస్ పై ప్రజల ప్రేమ ఉందన్నారు. మీతో నాకున్నది రాజకీయ బంధం కాదు.. కుటుంబ బంధమ‌న్నారు. నా జీవితాతం మీకు సేవ చేస్తూనే ఉంటా.. నా జీవితాంతం తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటా.. ఏదో ఒక రోజు మేడ్ ఇన్ తెలంగాణ అనేది మేడ్ ఇన్ చైనా కంటే బలంగా వినిపిస్తుందన్నారు.

Updated On 7 April 2024 12:11 AM GMT
Yagnik

Yagnik

Next Story