Rahul Gandhi Comments On KCR : కేసీఆర్ దోచుకున్న సొమ్మును తిరిగి ప్రజలకు చెందేలా చూస్తాం
మోదీ(modi), కేసీఆర్ పాలనలో సిలిండర్ ధర రూ.12 వందలకు చేరిందని.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు.

Rahul Gandhi Comments On KCR
ఈ ఎన్నికలు(elections) దొరల తెలంగాణ(telangana)కు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని కాంగ్రెస్(congress) నేత రాహుల్ గాంధీ(rahul gandhi) అన్నారు. అంబటిపల్లి(Ambatipalli)మహిళా సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. లక్ష కోట్ల తెలంగాణ సంపద దోపిడీకి గురైందని.. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) కేసీఆర్ (kcr)కు, ఆయన కుటుంబానికి ఏటీఎం(atm)గా మారిందని ఆరోపించారు. రాష్ట్ర సంపదను దోచుకుని తెలంగాణలో ప్రతీ కుటుంబంపై అప్పు భారాన్ని మోపారని మండిపడ్డారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును తిరిగి ప్రజలకు చెందేలా చూస్తామని.. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం(mahalaxmiScheme)ద్వారా ప్రతీ మహిళకు నెలకు రూ.2500 అందించనున్నామని తెలిపారు.
మోదీ(modi), కేసీఆర్ పాలనలో సిలిండర్ ధర రూ.12 వందలకు చేరిందని.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఎన్నికల్లో బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS), ఎంఐఎం(MIM) కలిసి పనిచేస్తున్నాయని.. అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
