బీఆర్ఎస్(BRS) బ‌హిష్కృత నేత‌, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో(Ponguleti srinivas Reddy) పాటు అనుచ‌రుల‌ చేరిక నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఖమ్మంలో(Khammam) 2వ తేదీన నిర్వహించనున్న సభకు ఏర్పాట్లు జ‌రుగుగుత‌న్నాయి. రాహుల్‌గాంధీ(Rahul gandhi), మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే(Malikarjun Karge) హాజ‌రుకానున్న‌ ఈ సభకు తెలంగాణ జనగర్జన(Janagarjana) సభగా నామ‌క‌ర‌ణం చేశారు. ఈ నేప‌థ్యంలోనే సభను విజయవంతం చేసేందుకు నేత‌లు కసరత్తు చేస్తున్నారు. ఖమ్మం-వైరా రోడ్డులో ఎస్‌ఆర్‌గార్డెన్‌ సమీపంలోని వంద ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసి.. యంత్రాలు, ట్రాక్టర్ల సాయంతో చదును చేస్తున్నారు.

బీఆర్ఎస్(BRS) బ‌హిష్కృత నేత‌, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో(Ponguleti srinivas Reddy) పాటు అనుచ‌రుల‌ చేరిక నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఖమ్మంలో(Khammam) 2వ తేదీన నిర్వహించనున్న సభకు ఏర్పాట్లు జ‌రుగుగుత‌న్నాయి. రాహుల్‌గాంధీ(Rahul gandhi), మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే(Mallikharjuna Kharge) హాజ‌రుకానున్న‌ ఈ సభకు తెలంగాణ జనగర్జన(Janagarjana) సభగా నామ‌క‌ర‌ణం చేశారు. ఈ నేప‌థ్యంలోనే సభను విజయవంతం చేసేందుకు నేత‌లు కసరత్తు చేస్తున్నారు. ఖమ్మం-వైరా రోడ్డులో ఎస్‌ఆర్‌గార్డెన్‌ సమీపంలోని వంద ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసి.. యంత్రాలు, ట్రాక్టర్ల సాయంతో చదును చేస్తున్నారు. వాహనాల పార్కింగ్‌ కోసం ఆ స్థలానికి సమీపంలోని మరో 50ఎకరాల స్థలాన్ని గుర్తించారు. ఓ వైపు పార్టీ నేతలు, శ్రేణులతో పాటు త్వరలో పార్టీలో చేరబోయే పొంగులేటి అనుచరులు కూడా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు అన్ని జిల్లాల నుంచి 4 లక్షల నుంచి 5 లక్షల మంది వరకు జనసమీకరణ చేసి తమ సత్తా చాటాలని భావిస్తున్నారు.

రాహుల్‌గాంధీతో పాటు కర్నాటక డీప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంతరెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి, రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ ఎంపీలు, మాజీ ఎంపీలు, ఏఐసీసీ, పీసీసీ నేతలు ఈ సభకు హాజరుకానున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మాజీమంత్రి జూప‌ల్లి కృష్ణారావు మరికొందరు ఇతర జిల్లాల నేతలు అదే సభలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతుండటంతో.. టీపీసీసీతో పాటు అధిష్టానం కూడా ఈసభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నందున ఈ సభ ఎన్నికల శంఖారావానికి వేదికగా.. రాష్ట్ర శ్రేణుల‌లో నూత‌న‌ ఉత్సాహాన్ని తీసుకువ‌స్తుంద‌ని నేతలు ఆశిస్తున్నారు.

రాహుల్ సభను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించబోతున్నామని, 5 లక్షల మంది అంచనాతో సభా ఏర్పాట్లు చేస్తున్నామని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి తెలిపారు.

రేపు ఖ‌మ్మంకు రేవంత్(Revanth)

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు ఖమ్మం డీసీసీ కార్యాలయంలో(DCC) జులై 2న జరగబోయే తెలంగాణ జన గర్జన సభ సన్నాహక సమావేశం జ‌రుగ‌నుంది. శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ లో డీసీసీ అధ్యక్షులు, సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల ఛైర్మన్ లు పాల్గొంటారు. ఈ మేర‌కు గాంధీ భ‌వ‌న్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

Updated On 29 Jun 2023 6:09 AM GMT
Ehatv

Ehatv

Next Story