ఖమ్మంలో జరిగిన తెలంగాణ జన గర్జన సభకు ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర తరువాత తిరిగి తెలంగాణకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా విద్వేషాన్ని తొలగించే ప్రయత్నం చేశామన్నారు.
ఖమ్మం(Khammam)లో జరిగిన తెలంగాణ జన గర్జన(Telangana Jana Garjana) సభకు ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yathra) తరువాత తిరిగి తెలంగాణకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా విద్వేషాన్ని తొలగించే ప్రయత్నం చేశామన్నారు. తెలంగాణలో వెయ్యి కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన భట్టి(Bhatti Vikramarka)కి ధన్యవాదాలు తెలిపారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(ponguleti Srinivas Reddy)కి పార్టీలోకి స్వాగతం పలికారు. కష్టకాలంలో కాంగ్రెస్ ను వీడకుండా పోరాడుతున్న కాంగ్రెస్(Congress) శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు.
తొమ్మిదేళ్ల బీఆర్ఎస్(BRS) పాలనలో తెలంగాణ ప్రజల కలలు కల్లలయ్యాని విమర్శించారు. ఇప్పుడు టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చుకున్నారు. కేసీఆర్ తనకు తాను ఒక రాజుగా.. తెలంగాణను తన జాగీరుగా భావిస్తున్నారని అన్నారు. ఇందిరమ్మ పేదలకు ఇచ్చిన భూములను కేసీఆర్ లాక్కున్నారని ఆరోపించారు. దీనిపై జోడో యాత్రలో ప్రజలు నా దృష్టికి తెచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన భూములు కేసీఆర్ సొత్తు కాదు.. ఆ భూములు పేదల హక్కు అని అన్నారు. ధరణితో వేల ఎకరాల భూములు దోచుకున్నారని ఆరోపించారు.
రైతులు, ఆదివాసీలు, యువకులు, దళితులు.. ఇలా అన్ని వర్గాలను కేసీఆర్ దోచుకున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ లో కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడితే.. బీఆర్ఎస్ బీజేపీ(BJP) కి బీ టీమ్(B Team) గా పనిచేసింది. కేసీఆర్(KCR) రిమోట్(Remote) నరేంద్ర మోదీ(Narendra Modi) చేతుల్లో ఉందని అన్నారు. వరంగల్ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ తో ఒక ముందడుగు వేసాం.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ రూ. 4000 అందిస్తామని ప్రకటించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పోడు భూములన్నింటికీ పట్టాలు అందిస్తామన్నారు. తెలంగాణ(Telangana)లోను కర్ణాటక ఫలితాలే రిపీట్(Repeate) అవుతాయని జోష్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని అన్నారు.. విపక్షాల సమావేశానికి బీఆర్ఎస్ ను పిలవమని కొందరు చెప్పారు. కానీ బీఆర్ఎస్ ను పిలిస్తే కాంగ్రెస్ సమావేశానికి రాదు అని మేం స్పష్టం చేశాం.. బీజేపీకి బీ టీమ్ బీఆర్ఎస్ తో కాంగ్రెస్ ఎప్పుటికీ కలవదని స్పష్ట చేశారు.. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిష్తేజార్ సమితి(బీజేపీ బంధువుల సమితి పార్టీ) అని కామెంట్ చేశారు. కర్ణాటక(Karnataka)లోలాగే తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు తమ శక్తిని చూపాలని.. బీజేపీ బీ టీమ్ కు బుద్ది చెప్పి రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.