ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ కూడా దూకుడుగా ప్రచారం చేస్తుంది.
ఎన్నికల ప్రచారాని(Election campaign)కి ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. కాంగ్రెస్(Congress) కూడా దూకుడుగా ప్రచారం చేస్తుంది. ఈ రోజు ఆరు నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి(Revanth Reddy), మరో ఆరు నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ(Rahul Gandhi), ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్(Bhupesh Baghel) ప్రచారం చేయనున్నారు. ఆదివారం నారాయణపేట్, దేవరకద్ర, మహబూబ్ నగర్, కామారెడ్డి, పఠాన్ చెరు, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో జరుగనున్న ప్రచార సభల్లో రేవంత్ పాల్గొననున్నారు.
ఉదయం 10 గంటలకు నారాయణపేట్ బహిరంగసభ, ఉదయం 11 గంటలకు దేవరకద్ర బహిరంగసభ, మధ్యాహ్నం 12 గంటలకు మహబూబ్ నగర్ జనసభ, మధ్యాహ్నం 2 గంటలకు రాహుల్ గాంధీతో కలిసి కామారెడ్డి బహిరంగసభ, సాయంత్రం 5.30 గంటలకు పఠాన్ చెరు జనసభ, సాయంత్రం 6.30 గంటలకు శేరిలింగంపల్లి జనసభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు.
రాహుల్ గాంధీ.. మధ్యాహ్నం 1 గంటకు ఆందోల్ లో, మధ్యాహ్నం 2.30 గంటలకు సంగారెడ్డిలో, సాయంత్రం 4.15 గంటలకు కామారెడ్డిలో ప్రచారం నిర్వహిస్తారు. ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్.. మద్యాహ్నం 1 గంటకు వెస్ట్ వరంగల్ కాజీపేట చౌరస్తా, మధ్యాహ్నం 3.30 గంటలకు సర్కస్ గ్రౌండ్ కరీంనగర్ ప్రచార సభలలో పాల్గొంటారు.