నాగర్‌కర్నూలు(Nagarkurnool) జిల్లా బల్మూరులో(Balmur) అభంశుభం తెలియని ఓ బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు రాఘవేందర్ ప్రేమపేరుతో వంచించాడు. ప్రేమపేరుతో 15 ఏళ్ల మైనర్‌ బాలికను(Minor girl) లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుందామని బాలిక ఒత్తిడి చేయడంతో నిందితుడు కొత్త ఎత్తుగడ వేశాడు. పెళ్లికి కుటుంబసభ్యులు ఒప్పుకోవడం లేదని నిందితుడు రాఘవేందర్‌ ఈనెల 11న గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలోకి తీసుకెళ్లాడు.

నాగర్‌కర్నూలు(Nagarkurnool) జిల్లా బల్మూరులో(Balmur) అభంశుభం తెలియని ఓ బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు రాఘవేందర్(Raghavendar) ప్రేమపేరుతో వంచించాడు. ప్రేమపేరుతో 15 ఏళ్ల మైనర్‌ బాలికను(Minor girl) లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుందామని బాలిక ఒత్తిడి చేయడంతో నిందితుడు కొత్త ఎత్తుగడ వేశాడు. పెళ్లికి కుటుంబసభ్యులు ఒప్పుకోవడం లేదని నిందితుడు రాఘవేందర్‌ ఈనెల 11న గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలోకి తీసుకెళ్లాడు.

బాలిక మైనరైనందును తమ ఇంట్లో పెళ్లికి ఒప్పుకోవడంలేదని ఆమెను నమ్మించాడు. ఇద్దరం కలిసి బతకలేకున్నా కలిసి చనిపోదామని కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. ఇందుకు సమ్మతించిన బాలికతో ముందుగా పురుగుల మందు(Insecticide) తాగించాడు. తర్వాత తాను తాగినట్లు నటించాడు. బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో మరో యువకుడి సహాయంతో బాలికను బైక్‌పై అచ్చంపేట ఆస్పత్రికి తరలించాడు. ఆ తర్వాత బాలిక కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. బాలిక పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి నిమ్స్‌కు(NIMS) తరలించగా అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలికను రాఘవేందరే చంపాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఇక ఇదే విషయంపై గ్రామపెద్దలు బాలిక తల్లిదండ్రులతో ఓ ఒప్పందం చేసుకున్నారు. రాఘవేందర్‌ తండ్రికి చెందిన రెండెకరాల పొలాన్ని ఆమె మృతిరాలి కుటుంబసభ్యులకు ఇచ్చేందుకు ఒప్పించారు. ఈ మేరకు ఒప్పంద పత్రాలు కూడా రాసుకున్నారు. ధరణిలో(Dharani) స్లాట్‌ కూడా బుక్‌ చేసుకున్నారు. ఆ తర్వాత బాలికనే ఆత్మహత్య చేసుకుందని పోలీసుల ఎదుట తల్లిదండ్రులతో చెప్పించేలా తీర్మానం చేసుకున్నారు. ఆత్మహత్య కేసుగా నమోదు చేయించి బాలిక అంత్యక్రియలు జరిపించాలని అనుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని మాత్రం పోలీసులు ధృవీకరించలేదు.

Updated On 15 May 2024 12:13 AM GMT
Ehatv

Ehatv

Next Story