మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ఎర్రవల్లిలోని తననివాసంలో గురువారం రాత్రి బాత్ రూంలో కాలుజారిపడటంతో ఎడమకాలితుంటి ఎముక ప్రాక్చర్ అయింది. దీంతో ఆయ‌య‌ను వెంటనే సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయ‌న‌కు యశోద దవాఖానాలో డాక్టర్లు చికిత్స అందజేస్తున్నారు. సిటీ స్కాన్ చేసిన వైద్యులు ఎడమకాలి తుంటి విరిగిందని, శస్త్రచికిత్స ద్వారా రీప్లేస్ చేయాల్సి వస్తుందని డాక్టర్లు హెల్త్ బులిటిన్ విడుదల చేశారు.

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ఎర్రవల్లిలోని తననివాసంలో గురువారం రాత్రి బాత్ రూంలో కాలుజారిపడటంతో ఎడమకాలితుంటి ఎముక ప్రాక్చర్ అయింది. దీంతో ఆయ‌య‌ను వెంటనే సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయ‌న‌కు యశోద దవాఖానాలో డాక్టర్లు చికిత్స అందజేస్తున్నారు. సిటీ స్కాన్ చేసిన వైద్యులు ఎడమకాలి తుంటి విరిగిందని, శస్త్రచికిత్స ద్వారా రీప్లేస్ చేయాల్సి వస్తుందని డాక్టర్లు హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. కోలుకోవడానికి ఇందుకు 6 నుంచి 8 వారాల సమయం పడుతుదని తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపారు.

కేసీఆర్ ఆరోగ్య ప‌రిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరా తీశారు. ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు కూడా ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా కోరుతున్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ర‌ఘువీరా రెడ్డి(Raghuveera Reddy) కూడా సీఎం కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిల‌షించారు. ఆయ‌న ట్విట‌ర్ వేదిక‌గా.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యావంతులుగా ఉండాలని మనస్పూర్తి కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.

Updated On 8 Dec 2023 3:55 AM GMT
Ehatv

Ehatv

Next Story