టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 7న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పలువురు నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Raghuveera Reddy special wishes for Revanth Reddy
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy(ని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 7న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పలువురు నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా సోషల్ మీడియా(Social Media) వేదికగా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణా(Telangana) సి.యల్. పి(CLP) నాయకునిగా ఎన్నికైన మిత్రుడు అనుముల రేవంత్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ఓ పోస్టు చేశారు. ఇదిలావుంటే.. తెలంగాణలో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో విజయం సాధిస్తుందని రఘువీరా రెడ్డి గతంలో జోస్యం చెప్పారు. ఆయన చెప్పిందే జరగడంతో ఆనందం వ్యక్తం చేశారు.
రఘువీరా రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 1989లో మడకశిర నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున శాననసభ్యుడిగా ఎన్నికయ్యారు. కోట్ల విజయభాస్కర రెడ్డి(Kotla Vijay Baskar Reddy) మంత్రివర్గంలో పశు సంవర్థక శాఖా మంత్రిగా పనిచేశారు. 1994 శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.1999లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 లో మరోసారి గెలుపొంది వై.ఎస్.రాజశేఖరరెడ్డి(YS Rajashekar Reddy) మంత్రివర్గంలో వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వై.ఎస్.ఆర్ మంత్రివర్గంలో మళ్లీ వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేశారు. వై.ఎస్ మృతి తర్వాత కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో రెవిన్యూ శాఖా మంత్రిగా పనిచేశారు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో కూడా రెవిన్యూ శాఖా మంత్రిగా కొనసాగారు. ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత ఏపీ పీసీసీ(APPCC) అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. అనంతరం కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. కర్ణాటక ఎన్నికల సమయంలో యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా అవకాశం కల్పించింది.
