బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్ రామిరెడ్డిని అరెస్ట్ చేయాలనీ డీజీపీకి ఫిర్యాదు చేసామ‌ని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్ రామిరెడ్డిని అరెస్ట్ చేయాలనీ డీజీపీకి ఫిర్యాదు చేసామ‌ని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెంకట్ రామిరెడ్డి పాత్ర ఉందని మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్ మెంట్ ఇచ్చాడు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకట్ రామిరెడ్డికి సంబందించిన మూడు కోట్లు తరలించినట్లు రాధాకిషన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. వెంకట్ రామిరెడ్డిపై ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఎందుకు వెంకట్ రామిరెడ్డిని కాపాడుతున్నారు.. ఎవ‌రు కాపాడుతున్నారు.. సమాధానం చెప్పాలని డీజీపీని కోరిన‌ట్లు వెల్ల‌డించారు.

పొంగులేటి వియ్యంకుడు వెంకట్ రామిరెడ్డిని అరెస్ట్ చేయ‌నియ్యడం లేదా.. ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వెంకట్ రామిరెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నా కూడా అరెస్ట్ చెయ్యడం లేదన్నారు. వెంకట్ రామిరెడ్డి, నీ కులం ఒకటే అని ముఖ్యమంత్రి కాపాడుతున్నారు.. వెంటనే వెంకట్ రామిరెడ్డిని అరెస్ట్ చేయాలన్నారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా వెంకట్ రామిరెడ్డిని అరెస్ట్ చేయాలన్నారు. ఫిర్యాదుపై డీజీపీ సానుకూలంగా స్పందించారని తెలిపారు.

Updated On 18 May 2024 8:20 AM GMT
Yagnik

Yagnik

Next Story